ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాస్ | Telangana Government Doctors Association state president, secretaries elected | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాస్

Published Mon, Jun 20 2016 2:34 AM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా  శ్రీనివాస్

ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాస్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డా. రవిశకర్‌లు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం కోఠిలోని తెలంగాణ వైద్యభవన్‌లో ఏర్పాటు చేసిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గౌరవ అధ్యక్షులుగా వీరేశం, కోశాధికారిగా నాగేందర్, ఉపాధ్యక్షులుగా లింగంగౌడ్, అన్న ప్రసన్న, సంజీవ్‌కుమార్, కార్యదర్శులుగా నర్సింగ్‌రావు, కిరణ్, షరీఫ్, లేగాల శ్రీనివాస్‌లు ఎన్నికగా శాశ్వత ఆహ్వానితులుగా కృష్ణారావు, సుబోద్‌కుమార్, ఎక్స్‌అఫిషియో సభ్యులుగా  చింతా రమేష్‌లు ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన కమిటీని రాష్ట్రంలోని వివిధ జిల్లాల వైద్యులు  ఘనంగా సన్మానించారు.

 

 పవర్ ఇంజనీర్స్ అధ్యక్షుడిగా సుధాకర్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎ.సుధాకర్‌రావు, ప్రధాన కార్యదర్శిగా పి.రత్నాకర్‌రావు ఎన్నికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 17న నిర్వహించిన ఎన్నికల ఫలితాలు ఆదివారం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement