హైదరాబాద్ : తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.5లక్షలకు పెంచుతూ రాష్ట్ర సర్కార్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ ప్రభుత్వం పెంచిన పరిహారం ఈ నెల 19 నుంచి వస్తుందంటూ అధికారికంగా జీవో జారీ చేశారు. పరిహారం రూ.5లక్షలు, రుణాలు తీర్చేందుకు మరో లక్ష రూపాయలు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించింది.