జర్నలిస్టులకు టీ.సర్కార్ తీపి కబురు | Telangana government issues new G.O for Journalists over welfare fund | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకు టీ.సర్కార్ తీపి కబురు

Published Mon, Jun 27 2016 6:41 PM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

Telangana government issues new G.O for Journalists over welfare fund

హైదరాబాద్ : జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ వినియోగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి  గత రెండేళ్లుగా వివిధ కారణాలవల్ల ఆకస్మిక మరణంపొందిన జర్నలిస్ట్ కుటుంబాలకు అర్థిక లబ్ధి లభించనుంది.

దీంతో  పాటు ప్రమాదాల్లో గాయాలపాలై పని చేయలేని స్థితిలో ఉన్నజర్నలిస్టులకు కూడా ఆర్థిక సహాయం అందనుంది. ప్రతి నెల కూడా కొంత మొత్తన్ని ఆ కుటుంబాలకు అందించనున్నారు. వీటితో పాటు ప్రఖ్యాత  యూనివర్సిటీలలో జర్నలిజం చదివే జర్నలిస్ట్ పిల్లలకు సైతం రెండు లక్షల రూపాయల ప్రోత్సాహాన్ని అందించనున్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజె రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ ఈ జీవో విడుదలకు చొరవ చూపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement