కొత్త జిల్లాల మ్యాప్లు విడుదల | Telangana Government Releases New Districts Maps | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాల మ్యాప్లు విడుదల

Published Fri, Aug 26 2016 4:28 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

కొత్త జిల్లాల మ్యాప్లు విడుదల - Sakshi

కొత్త జిల్లాల మ్యాప్లు విడుదల

హైదరాబాద్ : రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నకొత్త జిల్లాల మ్యాప్లను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మరోవైపు జిల్లాల డ్రాప్ట్పై భారీగా అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకూ 5వేలకు పైగా విజ్ఞప్తులు, అభ్యంతరాలు స్వీకరించారు. కాగా కొత్త జిల్లాలకు సంబంధించి ముసాయిదాను ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆయా జిల్లాల వారీగా ప్రజలు తమ అభ్యంతరాలను ఆన్ లైన్ ద్వారా తెలియజేయవచ్చు. అందుకోసం ప్రభుత్వం 30 రోజుల గడువునిచ్చింది. కొత్త జిల్లాల మ్యాప్ ల పోర్టల్ http://newdistrictsformation.telangana.gov.inలో చూడవచ్చు.
 
ప్రతిపాదిత కొత్త జిల్లాల రూపురేఖలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలను ఆ పోర్టల్ లో ప్రభుత్వం జిల్లాల వారీగా తెలియజేసింది. హైదరాబాద్ కు సంబంధించి ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఆ వివరాలను ముసాయిదాలో ప్రస్తావించలేదు. కాగా  తొమ్మిది జిల్లాలకు వేర్వేరుగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లతో కొత్త నోటిఫికేషన్ విడుదల అయింది. 

కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 10 జిల్లాలు, 44 రెవెన్యూ డివిజన్లు, 459 మండలాలున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన పునర్విభజన ముసాయిదా ప్రకారం మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లు, 490 మండలాలుగా రాష్ట్ర పరిపాలనా ముఖచిత్రం మారిపోనుంది.  తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్‌ 11 దసరా రోజున కొత్త జిల్లాల ఆవిర్భావం కానుంది. దసరా పండుగ రోజున తెలంగాణలో కొత్త జిల్లాల ఆవిర్భావాన్ని చూడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement