హైదరాబాద్ లో 1000 వైఫై హాట్ స్పాట్స్
హైదరాబాద్ లో 1000 వైఫై హాట్ స్పాట్స్
Published Tue, Jun 20 2017 5:22 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
తెలంగాణ ప్రభుత్వం నగరంలో 1000 పబ్లిక్ హాట్ స్పాట్లను ఏర్పాటుచేసింది. మంగళవారం లాంచ్ చేసిన 'హైదరాబాద్ సిటీ వైఫై' ప్రాజెక్ట్ కింద 1000కి పైగా పబ్లిక్ ప్రదేశాల్లో ఈ వైర్ లెస్ నెట్ వర్క్ టెక్నాలజీని అందించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్ బీ రామ్మోహన్ ఈ ప్రాజెక్టు ను లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్టు కింద నగరంలో మొత్తం 3000 హాట్ స్పాట్లను ఏర్పాటుచేయనున్నట్టు తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ చెప్పారు. వీటికోసం 3000 పబ్లిక్ ప్రాంతాలను కూడా గుర్తించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ నెట్ వర్క్ 1000 హాట్ స్పాట్లను ఇన్ స్టాల్ చేసింది.
ఈ హాట్ స్పాట్ల కింద 5-10ఎంబీపీఎస్ బ్యాండ్ విత్ లో 30 నిమిషాల పాటు ఉచిత వై-ఫైను అందించనుంది. మిగతా 2000 ప్రాంతాల్లో వచ్చే మూడు నెలల్లో ఏర్పాటుచేయనుంది. ఈ ప్రాజెక్టు మొత్తం ధర రూ.300 కోట్లు. 2015 జూన్ లో తీసుకొచ్చిన డిజిటల్ తెలంగాణ కింద ప్రభుత్వం ఈ పైలెట్ వెర్షన్ హైదరాబాద్ సిటీ వైఫై ప్రాజెక్టును లాంచ్ చేసింది. ఈ ప్రాజెక్టును వరంగల్, కరింనగర్, ఖమ్మం జిల్లాలకు కూడా విస్తరించనున్నట్టు రంజన్ చెప్పారు.
Advertisement
Advertisement