పర్యావరణ మదింపు జరిగాకే పోలవరం
ఈ మేరకు సుప్రీంకోర్టులో తెలంగాణ అఫిడవిట్ దాఖలు చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇచ్చిన పర్యావరణ అనుమతుల గడువు ముగిసిందని, ఈ దృష్ట్యా కొత్తగా పర్యావరణ అనుమ తులు తీసుకోవాల్సి ఉంటుం దంటూ రేలా అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ఫిటిషన్ దాఖలు చేసింది. ఇందులో ప్రతివాదులుగా తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలను చేర్చింది. దీనిపై గతంలో విచారణ చేసిన సుప్రీంకోర్టు తమ వివరణ ఇవ్వాలని ప్రతివాద రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రం తరఫున నీటి పారుదల శాఖ అంతర్రాష్ట్ర నదీ వ్యవహారాల చీఫ్ ఇంజనీర్ నర్సిం హారావు సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేశారు.
గోదావరిలో 50 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చినప్పుడు తెలంగాణలోని 9 మండలాలు.. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, బూర్గంపాడు, మణుగూరు, అశ్వాపురం, పినపాక మండాలాల్లోని 100 గ్రామాలపై ముంపు ప్రభావం ఉంటుందని తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకొని 2016 వరకు ఉన్న గరిష్ట వరద ప్రవాహాల లెక్కలను పరిగణనలోకి తీసుకుంటూ బ్యాక్‌వాటర్ ముంపును అధ్యయనం చేశాకే ప్రాజెక్టు నిర్మాణం చేయాలని కోరారు.