అంతర్జాతీయ పోటీకి ‘ప్రభుత్వ’ విద్యార్థిని
సాక్షి, హైదరాబాద్: జపాన్‌లో మే నెలలో నిర్వహించే సకురా అంతర్జాతీయ సైన్స్ ఫెయిర్‌కు రాష్ట్రం నుంచి మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం యెన్‌మనగండ్ల జిల్లా పరిషత్తు హైస్కూల్ పదో తరగతి విద్యార్థిని ఎం.లక్ష్మి ఎంపికైంది. ఇన్‌స్పైర్ అవార్డు పథకం కింద రాష్ట్రం నుంచి తొమ్మిది మంది విద్యార్థులు ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌లో పాల్గొన్నారు.
అందులో లక్ష్మితోపాటు కరీంనగర్‌లోని ఆల్‌ఫోర్స్ హైస్కూల్‌కు చెందిన బల్లా శ్రీఅన్షు జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు. చెవిటి, మూగ వ్యక్తులకు అలార్మింగ్ ఎయిడ్‌ను లక్ష్మి రూపొందించగా, కెమో కూలింగ్ ఫ్రిడ్జిని శ్రీఅన్షు తయారుచేసింది. కాగా, ఈ నెల 3న రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌లోనూ లక్ష్మి పాల్గొంది.