Alphors High School
-
‘అల్ఫోర్స్’ సంచలనం
కొత్తపల్లి (కరీంనగర్): ఇంటర్మీడియట్–2022 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో రాష్ట్రస్థాయిలో నెం.1గా నిలిచారని ఆ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నవ్యశ్రీ 994/1000 మార్కులతో, బైపీసీ విభాగంలో అర్చన 993/1000 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలిచారని పేర్కొన్నారు. సీనియర్ ఎంఈసీలో శ్రీచక్రిత 986/1000 మార్కులతో రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం పొందినట్లు వెల్లడించారు. ఇంటర్ ప్రథమ సంవత్సర ఎంపీసీ విభాగంలో పలు వురు 467/470 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారని తెలిపారు. బైపీసీ విభాగం లో 437/440 మార్కులు సాధించారన్నారు. ఎంఈసీ విభాగంలో శివాని 493 మార్కులతో రాష్ట్రస్థాయిలో నెం.1గా నిలిచినట్లు తెలిపారు -
పదో తరగతి ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థుల ప్రభంజనం
-
అంతర్జాతీయ పోటీకి ‘ప్రభుత్వ’ విద్యార్థిని
సాక్షి, హైదరాబాద్: జపాన్‌లో మే నెలలో నిర్వహించే సకురా అంతర్జాతీయ సైన్స్ ఫెయిర్‌కు రాష్ట్రం నుంచి మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం యెన్మనగండ్ల జిల్లా పరిషత్తు హైస్కూల్ పదో తరగతి విద్యార్థిని ఎం.లక్ష్మి ఎంపికైంది. ఇన్స్పైర్ అవార్డు పథకం కింద రాష్ట్రం నుంచి తొమ్మిది మంది విద్యార్థులు ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌లో పాల్గొన్నారు. అందులో లక్ష్మితోపాటు కరీంనగర్‌లోని ఆల్ఫోర్స్ హైస్కూల్‌కు చెందిన బల్లా శ్రీఅన్షు జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు. చెవిటి, మూగ వ్యక్తులకు అలార్మింగ్ ఎయిడ్‌ను లక్ష్మి రూపొందించగా, కెమో కూలింగ్ ఫ్రిడ్జిని శ్రీఅన్షు తయారుచేసింది. కాగా, ఈ నెల 3న రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌లోనూ లక్ష్మి పాల్గొంది.