టెట్ పేపర్ 1కు సెట్-1 ప్రశ్నాపత్రం ఎంపిక | telangana TET paper 1 set paer selected | Sakshi
Sakshi News home page

టెట్ పేపర్ 1కు సెట్-1 ప్రశ్నాపత్రం ఎంపిక

Published Sun, May 22 2016 7:09 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

telangana TET paper 1 set paer selected

హైదరాబాద్:  తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం నిర్వహిస్తున్నారు. పేపర్ 1, పేపర్ 2 అనే రెండు విభాగాలుంటాయి. ఉదయం 10 గంటలకు పేపర్ 1 పరీక్ష ప్రారంభమవుతోంది. మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్ష జరుగుతుంది. ఎడ్యూకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రంజీవ్ ఆచార్య పేపర్ 1 కు సెట్-1 కోడ్ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసి విడుదల చేశారు. అభ్యర్థులను నిర్ధేశిత సమయం కంటే అరగంట ముందే పరీక్ష హాలులోకి అనుమతిస్తామని... ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం 3.75 లక్షల మంది విద్యార్థులు టెట్ కు హాజరవనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement