
పుస్తకావిస్కరణ సభలో డాక్టర్ కె.వి.రమణాచారి తదితరులు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: బౌగోళికంగా విడిపోయినా తెలుగువారందరూ ఒక్కటేనని ఏపీ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ అధ్యక్షులు రావులపాటి సీతారామరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లేఖిని మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ, శ్రీ వేదరిగి కమ్యునికేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ కె.వి.రమణాచారి ‘అమృత వర్షిణి’, డైరెక్ట్ కథానికా సంకలనం–2016‘ పంచసప్తతి’, అంబటిపూడి వెంకటరత్నం కథానిక సంపుటి, చంద్రప్రతాప్ ‘టాంక్‌బండ్ కథలు’, వేదగిరి రాంబాబు సాహిత్య రేఖలు, పుస్తకాలను ఆవిష్కరించారు. రావులపాటి సీతారామరావు మాట్లాడుతూ మన అనుభవంలోని సంఘటలను కథల రూపంలో రాస్తే అంతకన్న గొప్ప కథలు మరొకటి ఉండవని అన్నారు. పుస్తక రచయిత డాక్టర్ కెవి.రమణాచారి మాట్లాడుతూ ఎన్నో పుస్తకాలను ఆవిష్కరించిన తనకు నా పుస్తకాన్ని ఆవిస్కరించుకోవటం ఆనందంగా ఉందని అన్నారు.కార్యక్రమలో పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.