నగర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను స్పీకర్ మధుసూదనాచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీ, అంబేద్కర్ విగ్రహాల వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
అలాగే, శాసనమండలి ఆవరణలో జాతీయ జెండాను చైర్మన్ స్వామిగౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్డేడియంలో జరిగిన రాష్ట్రావతర దినోత్సవాల్లో మంత్రి మహేందర్‌రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ రాహుల్ బొజ్జా జాతీయ జెండా ఆవిష్కరించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.