రోడ్లకూ ఆపరేషన్! | The new road construction | Sakshi
Sakshi News home page

రోడ్లకూ ఆపరేషన్!

Published Fri, Feb 20 2015 12:20 AM | Last Updated on Tue, Oct 2 2018 8:18 PM

The new road construction

త్వరలో ‘గుంతలు లేని నగరం’
వడివడిగా అడుగులు
తొలిదశలో 950 కి.మీ.
టెండర్లు పిలిచిన జీహెచ్‌ఎంసీ
ఏప్రిల్ నుంచి అమలు
 

 
సిటీబ్యూరో: విశ్వనగరం అంటే అందమైన భవనాలు... ఫ్లై ఓవర్లే కాదు. సాఫీ ప్రయాణానికి తోడ్పడే రహదారులూ అవసరమే. ఈ దిశగా జీహెచ్‌ఎంసీ అడుగులు వేస్తోంది. కొత్త రోడ్ల నిర్మాణంతో పాటు మరమ్మతులలోనూ అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని యోచిస్తోంది. రోడ్డు దెబ్బతిన్న విషయంపై ఫిర్యాదు అందిన 24 గంటల్లోగానే మరమ్మతులు పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ పనులు సమర్థంగా చేయగల సంస్థలను ఆహ్వానిస్తూ ఇప్పటికే టెండర్లు పిలిచింది.

గుంతలు లేని నగరం (పాట్ హోల్ ఫ్రీ సిటీ)గా చేయాలనే తలంపుతో గత ఆగస్టులోనే జీహెచ్‌ఎంసీ ప్రయోగాత్మకంగా రోడ్డు డాక్టర్ యంత్రాన్ని వినియోగించింది. అది మరమ్మతులకు గురికావడంతో పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అత్యాధునిక రోడ్డు డాక్టర్ యంత్రాలను వినియోగించేందుకు తాజాగా సిద్ధమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement