నేటి నుంచి 25 కేంద్రాల్లో అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్‌లో భారీగా పెరిగిన కందిపప్పు ధరలను దృష్టిలో పెట్టుకొని సామాన్య వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు కిలో రూ.120కే అందించేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చర్యలు తీసుకుంటోంది. ఎంపిక చేసిన రైతుబజార్‌లలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి వీటి విక్రయాలను శనివారం నుంచి ఆరంభించనుంది.
రాష్ట్రంలో కందిపప్పు ధరల నియంత్రణకు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 25వేల మెట్రిక్ టన్నుల కందిని సేకరించి అదనపు నిల్వలు(బఫర్ స్టాక్) సిద్ధం చేసి పెట్టింది. ఇందులోంచి రాష్ట్రం ఇప్పటికే 10వేల టన్నులు తీసుకుంది. అందులో 2వేల టన్నులకు టెండర్లు పిలిచి పప్పుగా మార్చింది. దాన్నే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 25 కేంద్రాల ద్వారా రూ.120 సబ్సిడీ ధరకు విక్రయించనుంది.
కిలో రూ.120కు కందిపప్పు విక్రయం
Published Sat, Jul 2 2016 4:43 AM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM
Advertisement
Advertisement