రె‘ఢీ’
ఎన్నికల వ్యూహాల్లో పార్టీలు
రేసులో ముందున్న అధికార పార్టీ
శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాల జోరు
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు గడువు సమీపిస్తుండడంతో అన్ని రాజకీయుపార్టీలు సన్నద్ధవువుతున్నారుు. వ్యూహ ప్రతి వ్యూహాలతో కదనర గంలోకి దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారుు. బల్దియా పీఠం కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారుు. ఇక అధికార టీఆర్‌ఎస్ పార్టీ అన్ని విషయూల్లోనూ దూసుకుపోతోంది. వీలైనన్నీ అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా సన్నాహాలు ముమ్మరం చేసింది. గడిచిన మూడు రోజులుగా జోరుగా సాగుతున్న శంకుస్థాపనలు సోమవారం కూడా కొనసాగనున్నాయి. మరో వైపు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే దిశగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సైతం రంగంలోకి దిగుతున్నారు. సోమవారం ఖైరతాబాద్ నియోజక వర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. సోమవారం కేటీఆర్ ఆధ్వర్యంలోని మంత్రుల బృందం ఖైరతాబాద్‌లో డబుల్ బెడ్‌రూంల ఇళ్లకు, సనత్‌నగర్‌లో నూతన మార్కెట్‌కు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్ , కుత్బుల్లాపూర్‌లో మంచినీటి రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మరో వైపు నగరంలో వివిధ వర్గాల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు సోమవారం సాయంత్రంలోగా ఇచ్చేందుకు అధికార యంత్రాంగం శ్రమిస్తోంది. నగరంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపనలు, ఉత్తర్వులు ఇచ్చే కార్యక్రమం పూర్తయ్యాకే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
మంత్రులకే గెలుపు బాధ్యతలు...
గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలుండగా పాతనగరం మినహా ఇతర కీలక నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలను ఒక్కో మంత్రికి అప్పగించేందుకు టీఆర్‌ఎస్ రంగం సిద్ధంచేసింది. దీని తోపాటు మొత్తం 150 డివిజన్లలో ప్రతి డివిజన్‌కు ఓ ముఖ్యనేతకు పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమించి గెలుపు బాధ్యతలను వారికి అప్పజెప్పనుంది. డివిజన్ల వారీగా ఇన్‌చార్జులను సోమవారం ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయా నియోజకవర్గాలను పర్యవేక్షిస్తున్న మంత్రులు తమ పరిధిలోని డివిజన్లలో విజయం సాధించేందుకు పక్కాగా పనిచేయాలని ఆది వారం జరిగిన పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఒక్కో డివిజన్ పర్యవేక్షకుడికి వెయ్యి మందిని సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించడంతో క్షేత్రస్థాయిలో పార్టీని గట్టెక్కించేందుకు పక్కా స్కెచ్ వేశారు.
నేడు నగరానికి గడ్కరీ ..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నగరంలో పట్టు సాధించేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. బీజేపీ మాజీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం భారీ సభను ఏర్పాటు చేశారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మేయర్ స్థానాన్ని కూడా తమకే కేటాయించాలన్న డిమాండ్‌ను బీజేపీ తన మిత్రపక్షమైన టీడీపీ ముందుంచనుంది. తెలుగుదేశం పార్టీ సైతం ప్రచారాన్ని వుువ్మురం చేసింది.
శంఖం పూరించిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఆదివారం సవుర శంఖాన్ని పూరిం చింది. గాంధీభవన్ ప్రకాశం హాలులో సవూవేశాన్ని నిర్వహించింది. పార్టీ రాష్ట్ర అగ్రనేతలు పాల్గొ ని ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చిం చారు. పెద్ద ఎత్తున నాయుకులు,కార్యకర్తలు తరలిరావడంతో గాంధీభవన్ సందడిగా వూరింది.