వార్డు మెంబర్‌ కూడా కాంగ్రెస్‌లో చేరడు | The Ward Member also will not join in the Congress | Sakshi
Sakshi News home page

వార్డు మెంబర్‌ కూడా కాంగ్రెస్‌లో చేరడు

Published Thu, Aug 31 2017 3:24 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

వార్డు మెంబర్‌ కూడా కాంగ్రెస్‌లో చేరడు - Sakshi

వార్డు మెంబర్‌ కూడా కాంగ్రెస్‌లో చేరడు

ఎమ్మెల్సీ భానుప్రసాద్‌
సాక్షి, హైదరాబాద్‌: టీ
ఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు ఉంటాయని ఆ పార్టీ నాయకులు చేస్తున్న వాదన హాస్యాస్పదంగా ఉందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ అన్నారు. మంత్రులు కాదు కదా, గ్రామ స్థాయిలో వార్డు మెంబర్‌ కూడా కాంగ్రెస్‌లో చేరరని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ మునిగిపోతున్న నావని, ఆ పార్టీలో ఎవరు చేరుతారన్నారు.

టీఆర్‌ఎస్‌లో తమ కోవర్టులు ఉన్నారంటూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క చెప్పడం ఆయనలో కోవర్టు లక్షణాన్ని బయట పెట్టిందని విమర్శించారు. అభివృద్ధి నిరోధక చర్యలు, కోర్టులకు వెళ్లడమే తప్ప కాంగ్రెస్‌ నేతలకు ఒక్క మంచి పని చేతకాదని ఎద్దేవా చేశారు. రైతు సమన్వయ సమితిల ఏర్పాటు దేశ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని, భూ సర్వేతో ఏళ్ల నాటి పంచాయితీలకు తెరపడుతుందని పేర్కొన్నారు. అవగాహన లేకనే కాంగ్రెస్‌ నేతలు భూ సర్వేపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement