హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై సభలో చర్చలో విపక్షాలు
♦ విద్యార్థులపై లాఠీచార్జి, అరెస్టు గర్హనీయమంటూ ధ్వజం
♦ వీసీ అప్పారావుపై కఠిన చర్యలకు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై శనివారం అసెంబ్లీ అట్టుడికింది. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి, అరెస్టులను ప్రతిపక్షం తప్పుబట్టింది. వర్సిటీలో వివక్షను ఆపాలని, రోహిత్ మృతికి కారకులను శిక్షించాలని డిమాండ్ చేసింది. అయితే ఈ సందర్భంగా సభ్యుల పరస్పర విమర్శలు, దూషణలతో చర్చ వేడెక్కింది. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల మృతిపై వివాదం, వర్సిటీ వీసీ అప్పారావుకు తిరిగి పగ్గాలు చేపట్టడం తదితర పరిణామాలపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు తీవ్ర స్థాయిలో వాదులాడుకోగా విద్యార్థులపై పోలీసుల చర్య విషయంలో ప్రభుత్వ తీరును ఎంఐఎం, వైఎస్సార్ కాంగ్రెస్ తప్పుబట్టాయి. హెచ్‌సీయూ, ఓయూ ఉదంతాలపై సభలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటన చేశారు. ఆ ప్రకటనపై జరిగిన చర్చలో పలు పార్టీల సభ్యులు మాట్లాడారు. వారేమన్నారంటే...
కన్హయ్య కోసమే అప్పారావును తెచ్చారు
జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ఈ నెల 23న హెచ్‌సీయూకు వస్తున్నారనే సమాచారంతో విద్యార్థులను రెచ్చగొట్టేందుకే 22న సెలవులో ఉన్న వర్సిటీ వీసీ అప్పారావును విధుల్లోకి తెచ్చారు. వర్సిటీల్లో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీసీ అప్పారావును రీకాల్ చేసి జైలుకు పంపాలి. హెచ్‌సీయూలో యుద్ధ వాతావరణం లేకుండా చూడాలి.
- రవీంద్ర కుమార్, సీపీఐపక్ష నేత
వీసీని విధుల్లోకి తీసుకోవడమే గొడవలకు కారణం
హెచ్‌సీయూ వీసీ అప్పారావును తిరిగి విధుల్లోకి తీసుకోవడమే గొడవలు రాజుకోవడానికి కారణం. అప్పారాావు చేరికను వ్యతిరేకించిన 25 మందిని పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ చిత్రహింసలకు గురి చేసి జైల్లో పెట్టడం సమంజసమా? హెచ్‌సీయూ ఘటనలకు కారకులైన అప్పారావుపై కేసు నమోదు చేయాలి. ఓయూలో ఎమ్మెల్యే సంపత్‌ను పోలీసులు చితకబాదడం శోచనీయం.
- పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీపక్ష నేత
సీఎం మాట్లాడుతున్నప్పుడు ఎంఐఎం కూర్చోలేదు
హెచ్‌సీయూకు సంబంధించి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చూసింది. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం సమస్యలను సృష్టించడం మంచిది కాదు. సీఎం మాట్లాడుతుంటే మేం అందరం కూర్చుంటాం. కనీసం ఎంఐఎం సభ్యులు కూర్చోలేదు. మిత్రపక్షమని చెబుతూనే సీఎం లేచినప్పుడు కూడా మాట్లాడారు.
- గువ్వల బాలరాజు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
వీసీని రీకాల్ చేయాలి
వీసీ అప్పారావును రీకాల్ చేయాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసి ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. కన్హయ్యను రోహిత్ తల్లి కలిసేందుకూ పోలీసులు అవకాశమివ్వాలి. మతసామరస్యాన్ని కాపాడాలి.
- సున్నం రాజయ్య, సీపీఎంపక్ష నేత
రాజకీయ విషవలయంలో పార్టీలు
ఒక విద్యార్థి చనిపోతే శవరాజకీయాలు చేయ డం అలవాటుగా మా రింది. రాజకీయ విష వలయంలో పార్టీలు కూరుకుపోయాయి. తెలంగాణ ఉద్యమంలో 1,200మంది ఆత్మబలి దానాలు చేసుకున్నప్పుడు పరామర్శించేం దుకు రాని వాళ్లు రోహిత్ మరణాన్ని రాజకీయంగా వాడుకున్నారు.ఉస్మానియా వర్సిటీలో ఎమ్మెల్యే సంపత్, టీడీపీ నేత రాజారాం యాదవ్‌పై దాడిపై డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.
- రేవంత్‌రెడ్డి, టీడీఎల్‌పీ నేత
రాహుల్‌ది రాజకీయ యాత్ర కాదు..
రోహిత్ మరణం సమాజాన్ని జాగృతం చేసే అలారం గంట వంటిది. దేశంలో బాధ్యతగల పాలకులు వివక్ష లేని పాలన అందించాలని రోహిత్ సమాజాన్ని హెచ్చరించారు. అతని మరణం వెనుకగల నిజాలను వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రోహిత్ మరణంతో కుంగిపోయిన అతని తల్లిని ఓదార్చేందుకే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హైదరాబాద్ వచ్చారే తప్ప, రాజకీయాల కోసం కాదు. మా పార్టీ వాళ్లనెవరినీ యూనివర్సిటీకి రావద ్దని చెప్పారు. రాజకీయాల కోసమే ఆయన వచ్చిఉండుంటే యూనివర్సిటీని దిగ్బంధం చేసేవాళ్లం. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీయే ఈ అంశంపై పార్లమెంటులో రాజకీయం చేశారు.
రోహిత్ మరణంపై సీఎం స్పందించలేదని, 12 గంటల వరకు వైద్యం అందలేదని స్మృతి పార్లమెంటులో చెప్పారు. కానీ ఈ విషయంపై ఎంపీ జితేందర్ రెడ్డి పార్లమెంటు మాట్లాడుతూ డ్యూటీ డాక్టర్ రాజేశ్వరి ఫోన్ వచ్చిన ఐదు నిమిషాల్లోనే యూనివర్సిటీలో ఉన్నట్లు చెప్పారని అన్నారు. ఈ నేపథ్యంలో జరిగిందేంటో స్పష్టం చేయాలి. రోహిత్ దళితుడే కాదని హోంమంత్రి చెప్పడం విచారకరం. వీసీ అప్పారావు విషయంలో విద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్లను చితకబాది కేసులు పెట్టి జైలుకు పంపారు. అంబేద్కర్ స్టడీ సెంటర్ డెరైక్టర్ రత్నంను చెంపదెబ్బలు కొట్టారు. ఇవి అంబేద్కర్ వాదులందరికీ తగిలిన దెబ్బలు. వర్సిటీలో వివక్షను ఆపాలి. రోహిత్ మరణానికి కారకులైన వారిని శిక్షించాలి. సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తున్నానని చెప్పే సీఎం కేసీఆర్ హెచ్‌సీయూకు ఒక్కరోజూ వెళ్లలేదు. దేశ సమగ్రతపై బీజేపీ నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఓయూలో ఎమ్మెల్యే సంపత్ కుమార్‌పై పోలీసుల తీరును ఖండిస్తున్నా.
- భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సభ్యుడు
అవును పక్కా రాజకీయమే..
తెలంగాణ ఉద్యమం సమయంలో ఎంతోమంది దళిత విద్యార్థులు, విద్యార్థియేతరులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకు రాని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ రోహిత్ ఆత్మహత్య తర్వాత రెండు మార్లు హెచ్‌సీయూకు ఎందుకొచ్చారు? తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రోహిత్ లేఖలో పేర్కొన్నప్పటికీ కొందరు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చి ఉద్రిక్తతలను రెచ్చగొట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమ ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలే కారణమని లేఖలో రాసి చాలా మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నా కనీసం పరామర్శకు రాని కాంగ్రెస్ నాయకులు రోహిత్ ఆత్మహత్యను అవకాశంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాల కోసం నైతికంగా ఎంతకైనా దిగజారేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధపడతారు.
(ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీజేపీ పక్ష నేత లక్ష్మణ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది). మెడపై కత్తి పెట్టి భారతమాతకు జై అనమంటే అననంటూ వ్యాఖ్యానించిన ఎంపీ (అసదుద్దీన్‌ను ఉద్దేశించి) కూడా హెచ్‌సీయూకి వెళ్లి రాజకీయాలు చేయటం సిగ్గుచేటు. సుప్రీం కోర్టు ఉరిశిక్ష వేసిన ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడిన వీరిపై చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాది శవయాత్రలో పాల్గొన్న వీరి వల్ల తెలంగాణకు అవమానం కలిగింది. విశ్వనగరంగా హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం అంటుంటే ఇలాంటి ద్రోహులు మరోరకంగా హైదరాబాద్‌ను ప్రపంచం ముందు నిలుపుతున్నారు. ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగింస్తున్న వారిపై ఎందుకు కేసులు నమోదు చేయటం లేదు. ఓయూలో ఎమ్మెల్యే సంపత్‌పై దాడిని ఖండిస్తున్నా.
- ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, బీజేపీ సభ్యుడు
కావాలంటే నన్ను చంపండి..
అంబేడ్కర్ భావజాలంతోపాటు దళితులను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న దమనకాండకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించేలా ప్రస్తుతం జరుగుతున్న పరిణామలు ఉన్నాయి. కావాలంటే నన్ను చంపండి కానీ దళితులను ఎందుకు వేధిస్తారు. హెచ్‌సీయూలో పరిస్థితిని ప్రశాంతంగా మార్చేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని పార్లమెంటులో టీఆర్‌ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డి చెప్పారు. కానీ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉందంటే జితేందర్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టించినట్టే కదా. వర్సిటీలో పరిస్థితి గురించి మాట్లాడేందుకు గంటపాటు ఎదురుచూసినా ముఖ్యమంత్రి నుంచి స్పందన రాలేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటులో పేర్కొన్నార ంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. దళితుల్లో ఆత్మస్థైర్యం నింపేది ఇలాగేనా? హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై హోంమంత్రి ప్రకటన కూడా సరిగా లేదు.
ఉస్మానియా యూనివర్సిటీలో లభించిన యువకుడి మృతదేహం విద్యార్థిది కాదనటానికి ఆధారాలు చూపాలని డిమాండ్ చేసిన విద్యార్థులపై పోలీసులు దాడి చేశారు. నేను అక్కడికి వెళ్లి పోలీసులతో మాట్లాడి పరిస్థితిని పరిశీలించాను. మృతదేహాన్ని వ్యాన్‌లో ఎక్కించేవరకు పోలీసులు బాగానే ఉన్నా ఆ తర్వాత వారి అసలు నైజం బయటపడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు గళం విప్పే అవకాశం ఉందని గ్రహంచి ఆ నినాదాలు రాకుండా వారిని అక్కడి నుంచి తరిమేందుకు పోలీసులే విద్యార్థులపై రాళ్లు రువ్వి పరిస్థితి చేయిదాటేలా చేశారు. నాతోపాటు వచ్చిన కొందరు నేతలు, విద్యార్థులు లక్ష్యంగా వందమంది పోలీసులు పనిచేశారన్నారు. ఎమ్మెల్యేగా నా హక్కులకు భంగం కలిగింది. దీనిపై నేను రిప్రజెంటేషన్ ఇస్తా.
- సంపత్ కుమార్, కాంగ్రెస్ సభ్యుడు
పోలీసుల తీరు దారుణం
Published Sun, Mar 27 2016 3:50 AM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM
Advertisement
Advertisement