భాగ్యనగర్‌కాలనీ: ఆటోలో ప్రయాణిస్తున్న యువతిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడో యువకుడు. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన జరిగింది. ఎస్సై క్రాంతికుమార్ కథనం ప్రకారం... భాగ్యనగర్‌కాలనీకి వెళ్లేందుకు ఓ యువతి ఎల్లమ్మబండలో ఆటో ఎక్కింది.
అదే ఆటో ఎక్కిన మెదక్ జిల్లాకు చెందిన వీరాస్వామి (25) తన సెల్‌ఫోన్ ద్వారా ఆమెను వీడియో తీయడం మొదలెట్టాడు. గమనించిన ఆటో డ్రైవర్ యువతికి విషయం చెప్పడంతో వీరాస్వామిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.