మొబైల్ షాపులో చోరీ | theft in mobile shop at hyderabad kukatpally | Sakshi
Sakshi News home page

మొబైల్ షాపులో చోరీ

Published Sun, Nov 13 2016 6:11 PM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

theft in mobile shop at hyderabad kukatpally

హైదరాబాద్ : నగరంలో దోపిడి దొంగలు హల్చల్ సృష్టిస్తున్నారు. దొంగలు రోజుకో ప్రాంతంలో చోరికి పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.

తాజాగా కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ మొబైల్ షాపులో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. సెల్‌ఫోన్ దుకాణం షట్టర్ పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు దుకాణంలోని విలువైన ఫోన్లతో పాటు, ఆరు కంప్యూటర్లు, రూ. 6 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement