‘అమ్మ’ ఆరోగ్యంపై అలక్ష్యమేనా..?
⇒ మొన్న నిలోఫర్, నిన్న గాంధీలో వరుస సంఘటనలు
⇒ నిలోఫర్‌లో మరణాలపై ఇప్పటికీ రాని కలెక్టర్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న బాలిం తల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిలోఫర్‌లో ఐదుగురు బాలింతల మృతి మరవకముందే... తాజాగా గాంధీ ఆస్పత్రిలో మరో ఇద్దరు మరణించడంపై విమర్శలు వినిపిస్తున్నా యి. ఈ ఘటనలు ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యమేనని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిలోఫర్ ఘటన ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యమేనని వైద్య ఆరోగ్యశాఖ అధికారులే చెప్పారు. నిలోఫర్ ఘటనపై కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించారు. ఇన్నేళ్లయినా కలెక్టర్ నివేదికను సమర్పించకపోవడంపై అనుమానాలు వస్తున్నాయి.
ఈ కేసులో ఇప్పటికీ నివేదిక ఇవ్వకుం డా, బాధ్యులను ఆస్పత్రిలోనే కొనసాగిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అక్కడి ఇద్దరు అధికారులను సరెండర్ చేసి వదిలేయడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలపై సర్కారు సరైన చర్యలు తీసుకోకపోవడంతో అసలు నిర్లక్ష్యపు మరణాలకు బ్రేక్ పడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యుల పై చర్యలు తీసుకోవడానికి వైద్య ఆరోగ్యశాఖ జంకుతోందన్న విమర్శలూ ఉన్నాయి. బాధ్యులైన అధికారులు, వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటే ఉద్యోగులనుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో ఉంది.
మరణాలు సహజమన్న సర్కారు..!
రాష్ట్రంలో ఏడాదికి 6.50 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. కేంద్రం లెక్కల ప్రకారం రాష్ట్రం లో ఏడాదికి 650 మంది తల్లులు చనిపోతున్నారని అంచనా. సాధారణంగా మారుమూల ప్రాంతాల్లో వైద్య వసతి లేకపోవడం వంటి కార ణాలతో తల్లుల మరణాలు సంభవి స్తుం టాయి. కానీ హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో కేవలం నిర్లక్ష్యంతో తల్లుల మరణాలు సంభవించడమేంటి? నిలోఫర్ çఘటనపై కలెక్టర్ నివేదికంటూ కాలయాపనకే వైద్య ఆరోగ్యశాఖ యత్నిస్తోందన్న చర్చ జరుగుతోంది.
గతంలో సరోజిని కంటి ఆస్పత్రి ఘటననూ కాలయాపనతో మరుగునపడేశారంటున్నారు. ‘బాలింత ఎం దుకు చనిపోయిందో నిర్ధారించడం 51% సాధ్యం కాదు. ఫలానా కారణంగానే చనిపోయారని చెప్పడం అసాధ్యం ’అని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. సరోజిని, నిలోఫర్, గాంధీ ఆస్పత్రులన్నీ బోధనాసుపత్రులే. వాటన్నింటికీ ప్రధాన బాధ్యత వహించే వ్యక్తిపై ఇప్పటికీ చర్యలు లేకపోవడం గమనార్హం. ‘మేము ఎంతో చేయాలనే వచ్చాం. కానీ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనలో వైఫల్యం కారణంగానే ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితులకు వైద్యులెలా బాధ్యులవుతారు?’ అని ఒక వైద్యుడు వ్యాఖ్యానించారు.