- కొన్ని సూచనలు..
- నిమిషం లేటైనా అనుమతించరు
- గంట ముందుగా పరీక్షాకేంద్రానికి చేరుకోవాలి
- 20 నిమిషాల ముందు హాల్లోకి అనుమతిస్తారు
- ఓఎంఆర్‌పై వైట్‌నర్, ఎరేజర్లు వాడకూడదు
- బ్లూ/బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నులే వాడాలి
- వీడియోగ్రఫీతో పటిష్ట పర్యవేక్షణ
సాక్షి, సిటీబ్యూరో: జంటనగరాల్లో ఆది వారం జరిగే వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల కోసం 280 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ ఎ.కోటేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు జరిగే వేళలు... ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, అలాగే సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. బస్సులపై ‘వీఆర్‌ఓ అండ్ వీఆర్‌ఏ’ అనే డెస్టినేషన్ బోర్డులు ఉంటాయి. నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ఇవి బయలుదేరుతాయి.
ప్రత్యేక బస్సులు నడిచే ప్రాంతాలివే...
సికింద్రాబాద్-కోఠీ, సికింద్రాబాద్-ఆఫ్జల్‌గంజ్, ఈసీఐఎల్-ఆఫ్జల్‌గంజ్, మెహదీపట్నం-సికింద్రాబాద్, రీసాలాబజార్-అబిడ్స్, జీడిమెట్ల-కోఠీ, సికింద్రాబాద్-సనత్‌నగర్, ఉప్పల్-సికింద్రాబాద్, నాంపల్లి-సికింద్రాబాద్, జగద్గిరిగుట్ట-సికింద్రాబాద్, ఈసీఐఎల్-సికింద్రాబాద్, హనుమాన్‌పేట్-సికింద్రాబాద్, కోఠీ-సికింద్రాబాద్, కోఠీ-సనత్‌నగర్, మెహదీపట్నం-చార్మినార్, హయత్‌నగర్-బహదూర్‌పురా, ఉప్పల్-మెహదీపట్నం, దిల్‌సుఖ్ నగర్-పటాన్‌చెరు, ఎల్‌బీనగర్-మెహదీపట్నం, రాంనగర్-మెహదీపట్నం, మిధానీ-సికింద్రాబాద్, మధుబన్‌కాలనీ-సికింద్రాబాద్, ఎల్‌బీనగర్-సికింద్రాబాద్ తదితర మార్గాలు.
ఓయూ నుంచి గ్రామాలకు...
ఉస్మానియా యూనివర్సిటీ: కాగా, ఈ పరీక్షల కోసం ఓయూ క్యాంపస్ నుంచి సుమారు 8 వేల మంది విద్యార్థులు తమతమ గ్రామాలకు తరలివెళ్లారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఇంటరే అయినా... ఇంజినీరింగ్, లా, బీఈడీ, పీజీ, పీహెచ్‌డీ తదితర ఉన్నత విద్య అభ్యశిస్తున్నవారు కూడా పోటీపడుతుండటం విశేషం.