నేడు టీడీపీ-బీజేపీ ఎన్నికల శంఖారావం | Today TDP-BJP election Clarion | Sakshi
Sakshi News home page

నేడు టీడీపీ-బీజేపీ ఎన్నికల శంఖారావం

Published Tue, Jan 12 2016 2:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

నేడు టీడీపీ-బీజేపీ ఎన్నికల శంఖారావం - Sakshi

నేడు టీడీపీ-బీజేపీ ఎన్నికల శంఖారావం

హాజరుకానున్న చంద్రబాబు

 సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, బీజేపీలు నిర్వహించే ఉమ్మడి సభ మంగళవారం సాయంత్రం నిజాం కళాశాల మైదానంలో జరగనుంది. ఎన్నికల శంఖారావం పేరుతో నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి రెండు పార్టీలు శ్రీకారం చుట్టబోతున్నాయి. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల సమావేశం పేరుతో సభను నిర్వహిస్తున్నప్పటికీ, గ్రేటర్‌లోని వివిధ నియోజకవర్గాల నుంచి భారీఎత్తున జన సమీకరణ జరపాలన్న ఆలోచనతో నేతలు ఉన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు బీజేపీ తరఫున కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా హాజరుకానున్నారు. తెలంగాణకు చెందిన టీడీపీ నేతలతోపాటు ఏపీలోని ఆ పార్టీ ముఖ్య నేతలను కూడా ఆహ్వానించారు. కేంద్రమంత్రులు వె ంకయ్య నాయుడు, దత్తాత్రేయ తదితరులూ హాజరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement