చార్మినార్: వరుస సెలవులతో పాతబస్తీలోని పర్యాటక స్థలాలు సందర్శకులతో కిటకిటలాడాయి. చార్మినార్, మక్కామసీదు, సాలార్‌జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్ తదితర పర్యాటక ప్రాంతాలన్నీ పర్యాటకులతో శని, ఆదివారాల్లో రద్దీగా మారాయి. ఎటు చూసినా సందడే.. సందడి. చార్మినార్ కట్టడాన్ని సందర్శించేందుకు పర్యాటకులు పోటీపడ్డారు. టిక్కెట్ల కోసం భారీ క్యూ కనిపించింది. ఫుట్‌పాత్ వ్యాపారాలతో పాటు చిరువ్యాపారాలు జోరుగా కొనసాగాయి.
ఆటో రిక్షాలను చార్మినార్ వరకు అనుమతించక పోయినప్పటికీ.. చార్మినార్ బాటిల్ నెక్ రోడ్డులో వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ కానిస్టేబుల్స్ లేకపోవడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి. దీంతో వాహనదారులతోపాటు పాదచారులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
పర్యాటకులతో పాతబస్తీ కళకళ
Published Sun, Aug 16 2015 5:21 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement