7,14 తేదీల్లో ఆలస్యంగా రైళ్లు | train's late in 7and 14th date | Sakshi
Sakshi News home page

7,14 తేదీల్లో ఆలస్యంగా రైళ్లు

Published Tue, May 31 2016 4:04 AM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

train's late in 7and 14th date

సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-డోన్ సెక్షన్‌లో నిర్మాణ పనుల దృష్ట్యా జూన్ 7, 14 తేదీల్లో పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-గుంతకల్ ప్యాసింజర్ ఉదయం 9.40కి బదులు 11.40కి బయలుదేరుతుంది, కర్నూల్-కాచిగూడ ప్యాసింజర్ ఉదయం 7.05కు బదులు ఉదయం 9.35కు కర్నూల్ నుంచి బయలుదేరుతుంది. మహబూబ్‌నగర్-మిర్జాపల్లి ప్యాసింజర్ సాయంత్రం 4.10కి బదులు రాత్రి 8 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి బయలుదేరుతుంది. కాచిగూడ-మహబూబ్‌నగర్ ప్యాసింజర్ మధ్యాహ్నం 1.10 గంటలకు బదులు సాయంత్రం 4.40కి కాచిగూడ నుంచి బయలుదేరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement