'ప్రాజెక్టులపై కాంగ్రెస్కు అవగాహన లేదు' | trs mp vinod slams congress leaders over maharashtra deal | Sakshi
Sakshi News home page

'ప్రాజెక్టులపై కాంగ్రెస్కు అవగాహన లేదు'

Published Tue, Aug 23 2016 4:40 PM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

'ప్రాజెక్టులపై కాంగ్రెస్కు అవగాహన లేదు' - Sakshi

'ప్రాజెక్టులపై కాంగ్రెస్కు అవగాహన లేదు'

ఢిల్లీ: ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ...నీళ్లున్న చోట ప్రాజెక్టులు కడతామంటే కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు సీఎం కేసీఆర్ బృందం బుధవారం ముంబై నుంచి హైదరాబాద్కు రానున్నారు. కేసీఆర్ బృందానికి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణం చేపట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ముంబై సహ్యాద్రి గెస్ట్హౌస్లో మంగళవారం ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫడ్నీవీస్, కేసీఆర్ లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ చారిత్రక ఒప్పందానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కేసీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement