trs mp vinod
-
'బంద్‌కు టీఆర్ఎస్ మద్దతుండదు'
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా ఈనెల 28న ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన భారత్‌బంద్‌కు తమ పార్టీ మద్దతుండదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్లో నోట్ల రద్దు చర్చపై కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధిలేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగ సవరణ అవసరం లేదన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని ఎంపీ వినోద్ తెలిపారు. -
'ప్రాజెక్టులపై కాంగ్రెస్‌కు అవగాహన లేదు'
ఢిల్లీ: ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ...నీళ్లున్న చోట ప్రాజెక్టులు కడతామంటే కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ బృందం బుధవారం ముంబై నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. కేసీఆర్ బృందానికి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణం చేపట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ముంబై సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌లో మంగళవారం ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫడ్నీవీస్, కేసీఆర్ లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ చారిత్రక ఒప్పందానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కేసీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. -
హైకోర్టు విభజన చేపట్టాలి: ఎంపీ వినోద్
హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టును వెంటనే విభజించాలని కరీంనగర్ ఎంపీ వినోద్ కోరారు. ఈమేరకు ఆయన కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడకు ఓ లేఖ రాశారు. హైకోర్టు విభజన ప్రక్రియ ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి చొరవ చూపాలన్నారు. హైకోర్టు విభజన చేపట్టక పోవటం వల్ల రెండు రాష్ట్రాలకు అనేక సమస్యలు వస్తాయన్నారు. -
పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దం
-
పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దం
న్యూఢిల్లీ : పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ఆయన శుక్రవారం లోక్ సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు. విభజన బిల్లు పాసయ్యాక ఆర్డినెన్స్ తీసుకు రావటం అన్యాయమని ఆయన అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర సరిహద్దులు మార్చేముందు ఇరు రాష్ట్రాల శాసనసభల అభిప్రాయం తీసుకోవాలని ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. ఈ నిబంధనను కేంద్రం పాటించలేదని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై సభలో మొదట చర్చ జరపాలని వినోద్ డిమాండ్ చేశారు.