ఒకే రోజు రెండు బ్యాంకుల ఇంటర్వ్యూలు! | two bank interviews in same day | Sakshi
Sakshi News home page

ఒకే రోజు రెండు బ్యాంకుల ఇంటర్వ్యూలు!

Published Tue, Aug 4 2015 9:47 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

ఒకే రోజు రెండు బ్యాంకుల ఇంటర్వ్యూలు!

ఒకే రోజు రెండు బ్యాంకుల ఇంటర్వ్యూలు!

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు(కడప), తెలంగాణ గ్రామీణ బ్యాంకు(హైదరాబాద్)లు ఉద్యోగాల భర్తీకి ఒకే రోజు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ఇంట ర్వ్యూలకు రావాలంటూ ఆర్‌ఆర్‌బీ పరీక్షల్లో ఎంపికయిన అభ్యర్థులకు లేఖలు, మెయిళ్లు వచ్చాయి. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో పడ్డారు.

ఉమ్మడి రాష్ట్రంలోని ఐదు గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి గత ఏడాది సెప్టెంబర్‌లో ఆర్‌ఆర్‌బీ పరీక్ష నిర్వహించింది. తొలి విడతలో కొందర్ని ఇప్పటికే నియమించుకోగా రెండో విడతగా జాబితాలోని మిగతావారిని ప్రస్తుతం ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు. అయితే ఒకే రోజు రెండు ఇంటర్వ్యూలు ఉండడంతో తేదీలు మార్చాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement