ఇద్దరు ఐపీఎస్ ట్రైనీలకూ స్వైన్ ఫ్లూ! | two ips trainees diagonised swine flu in ips academy | Sakshi

ఇద్దరు ఐపీఎస్ ట్రైనీలకూ స్వైన్ ఫ్లూ!

Feb 20 2015 1:39 PM | Updated on Sep 2 2017 9:38 PM

వైన్ ఫ్లూ... నగరాన్ని వణికిస్తోంది. తాజాగా ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీకి కూడా పాకింది.

స్వైన్ ఫ్లూ... నగరాన్ని వణికిస్తోంది. తాజాగా ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీకి కూడా పాకింది. అక్కడ శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారులకు స్వైన్ ఫ్లూ పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. దాదాపు 12 మంది వరకు ఫ్లూ తరహా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్లందరికీ దగ్గు, జలుబు, జ్వరం లాంటివి ఉండటంతో ముందుగానే అందరికీ యాంటీ వైరల్ మందులు, ఎన్-95 మాస్కులను అధికారులు అందజేశారు.

ఇప్పటివరకు డజను మంది ఐపీఎస్ ట్రైనీలకు పరీక్షలు నిర్వహించగా, మరో 13 మందికి సంబంధించిన శాంపిళ్లను కూడా ఐపీఎంకు పంపారు. ఇంకా వాటిని పరీక్షించాల్సి ఉంది.  వారిలో ఒక మహిళా ఐపీఎస్ ట్రైనీ కూడా ఉన్నారని ఓ సీనియర్ అధికారి తెలిపారు. తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల విధుల్లో పాల్గొని వచ్చిన తర్వాత నుంచే ఐపీఎస్ ట్రైనీలకు ఈ తరహా లక్షణాలు వస్తున్నాయని అన్నారు. ఇప్పుడు వచ్చిన ఇద్దరికీ కూడా అక్కడే ఈ వ్యాధి సోకి ఉంటుందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement