దొంగల దాడిలో రెండు వారాల వ్యవధిలోనే ఇద్దరు ఎస్ఐలు గాయపడ్డారు. ఇటీవలే దొంగనోట్ల కేసు ఛేదించే క్రమంలో ఎస్ఐ వెంకటరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా శంషాబాద్ వద్ద జరిగిన కేసులో ఎస్సై వెంకటేశ్వర్లు కత్తిపోట్లకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 10.30 ప్రాంతంలో సీసీఎస్ పోలీసులు శంషాబాద్ రింగ్ రోడ్డు ప్రాంతంలో నాకాబందీ చేస్తున్నారు. ఆ సమయంలో చైన్ స్నాచింగ్లో ఆరితేరిన శివ సర్వీసురోడ్డులో బైకు మీద వస్తుండగా పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కత్తితో ఎస్ఐ వెంకటేశ్వర్లు మీద దాడికి దిగారు. సీఐ నర్సింహారెడ్డ ఇమూడురౌండ్ల కాల్పులు జరిగాయి. వీపు పైభాగంలో బుల్లెట్ గుర్తులున్నాయి. సంఘనట స్థలంలోనే రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడి సెల్ఫోను, బ్యాటరీ, బైకు అక్కడే ఉన్నాయి. రాత్రి 11 గంటల ప్రాంతంలో సంఘటన జరిగింది. అతడు దాడికి పాల్పడటంతో ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామన్నారు. ఆర్డీవో నేతృత్వంలో పంచనామా చేసి, ఉస్మానియాకు తరలించారు. పోస్టుమార్టం చేసిన అనంతరం బంధువులకు అందజేస్తారు.
మియాపూర్, కూకట్పల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఇళ్ల ముందు ముగ్గులు వేసేవారు, పువ్వులు కోసేవాళ్లను టార్గెట్గా చేసుకుని చైన్ స్నాచింగులకు పాల్పడేవాడు. కొన్ని రోజుల క్రితమే సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు ఓజిలి మండలం ఆర్మేనిపాడుకు కూడా వెళ్లారు. అయితే అతడు ఇక్కడ బీఎన్ మక్తాలో నివాసం ఉన్నట్లు సమాచారం అందింది. సెల్ఫోను నెంబర్ దొరకడంతో.. దాని సిగ్నళ్ల ఆధారంగా అతడి ఆచూకీ కనుగొన్నారు.
15 రోజుల్లోనే ఇద్దరు ఎస్ఐలకు గాయాలు
Published Sat, Aug 16 2014 8:14 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement