two weeks
-
2024 ప్రారంభంలోనే పరేషాన్.. ఐటీ ఉద్యోగుల్లో మళ్ళీ మొదలైన కలవరం!
2023 ముగిసింది, కొత్త సంవత్సరం 2024 అయినా కలిసొస్తుందేమో అనుకున్న ఐటీ ఉద్యోగులకు మొదటి రెండు వారాల్లోనే చుక్కెదురైంది. ఇప్పటికి 46 ఐటీ అండ్ టెక్ కంపెనీలు సుమారు 7500 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. గత ఏడాది చివరి వరకు ఉద్యోగాల తొలగింపులను చేపట్టిన చాలా కంపెనీలు.. ఈ ఏడాది ప్రారంభంలో కూడా అదే ఫాలో అవుతున్నాయి. ఇందులో భాగంగానే 46 కంపెనీలు జనవరి 14 వరకు 7,528 మంది ఉద్యోగాల ఉద్యోగాలను తొలగించినట్లు layoff.fyi అందించిన లేటెస్ట్ డేటాలో తెలిసింది. 2024 ప్రారంభంలోనే ఆన్లైన్ రెంటల్ ప్లాట్‌ఫారమ్ ఫ్రంట్‌డెస్క్ రెండు నిమిషాల గూగుల్ మీట్ కాల్ ద్వారా ఏకంగా 200 మంది ఉద్యోగులను తొలగించేసింది. గేమింగ్ కంపెనీ యూనిటీ కూడా ఉన్న ఉద్యోగుల్లో సుమారు 25 శాతం మందిని లేదా 1800 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. హార్డ్‌వేర్, కోర్ ఇంజనీరింగ్ అండ్ గూగుల్ అసిస్టెంట్ టీమ్‌లలో అనేక వందల ఉద్యోగాలను తగ్గించినట్లు గూగుల్ గత వారం ధృవీకరించింది. అమెజాన్ యాజమాన్యంలోని ఆడియోబుక్ అండ్ పాడ్‌కాస్ట్ డివిజన్ ఆడిబుల్ ఈ-కామర్స్ దిగ్గజంలో మొత్తం ఉద్యోగాల కోతలో భాగంగా తన సిబ్బందిలో 5 శాతం లేదా 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ కూడా నూతన సంవత్సరంలోనే కొంతమంది టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్లను తొలగించింది. డిస్నీ యాజమాన్యంలోని యానిమేషన్ స్టూడియో పిక్సర్ కూడా ఈ ఏడాది ఉద్యోగాలను తగ్గించబోతున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. -
ఆ ప్రతిష్టాత్మక బ్రిడ్జ్ మూతపడింది
-
ఆ ప్రతిష్టాత్మక బ్రిడ్జ్ మూతపడింది
బీజింగ్ : చైనాలోని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ మూత పడింది. ఆగస్టు 22న ప్రారంభమైన గ్లాస్ వంతెనను కేవలం 13రోజుల్లో మూసివేశారు. మెయింటినెన్స్ కారణాల రీత్యా మూసివేస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. అత్యవసరంగా నిర్వహించాల్సిన మెయిన్టెనెన్స్ పనుల కోసం బ్రిడ్జ్‌ను మూసివేస్తున్నట్టు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. పునః ప్రారంభ సమయాన్ని మళ్లీ ప్రకటిస్తామని అధికారులు ప్రకటించారు. హునన్ ప్రావిన్స్‌లో రెండు కొండల మధ్య ఉన్న ఈ అతి ఎత్తైన, అతి పొడువైన గ్లాస్ బ్రిడ్జ్ (430 మీ. పొడవు) ప్రపంచంలో అతి పెద్ద గాజు వంతెనగా పేరొంది. బ్రిడ్జ్‌ను ప్రారంభించిన తర్వాత టూరిస్టుల తాకిడి మరింత పెరగడంతో ఈ నిర్ణయ తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతి రోజు 8 వేల మంది టూరిస్టులను తట్టుకునే శక్తి బ్రిడ్జ్‌కు ఉంది. కానీ రికార్డు స్థాయిలో అత్యధిక సంఖ్యలో సుమారు 10 రెట్ల పర్యాటకుల తాకిడి పెరగడంతో తక్షణమే ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 'తాము ప్రతిదీ బుక్ చేసుకున్నామని, ఇప్పుడు మూసివేశామంటున్నారు. ..తమాషా చేస్తున్నారా? తదితర కమెంట్లు వెల్లువెత్తాయి. -
బంగారం.. రెండు వారాలు ఆగండి!
-
బంగారం.. రెండు వారాలు ఆగండి!
కొంత వెనక్కు తగ్గవచ్చంటున్న నిపుణులు ముంబై/న్యూయార్క్: పసిడికి సంబంధించి వచ్చే రెండు వారాలూ వేచిచూసే ధోరణి అవలంబించడం మంచిదన్నది నిపుణుల సూచన. అమెరికా ఫెడ్ ఫండ్ రేటును (ప్రస్తుత శ్రేణి 0.25-0.50 శాతం) పెంచే విషయంలో నెలకొన్న సందిగ్ధత... పసిడిపైనా పడుతుందన్నది వారి వాదన. మొత్తంమీద పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 1,340 డాలర్ల దిగువకు పడిపోవడం వెనకడుగును సూచిస్తోందని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇది మద్దతు స్థాయి కావటం వల్ల ఇక్కడి నుంచి పసిడి పెరుగుతుందా? లేక మరింత కిందకు జారుతుందా? అన్నది ఫెడ్ ఫండ్ రేటుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. 0.25 శాతం నుంచి ఫెడ్ ఫండ్ రేటు పెరిగితే... క్రమంగా ఔన్స్ బంగారం 1,000 డాలర్ల దిగువకు జారిపోతుందన్న విశ్లేషణలకు భిన్నంగా ఈ ఏడాది ప్రారంభం నుంచీ భారీగా పెరిగి ఒక దశలో 1,370 డాలర్లకు చేరిన సంగతి గమనార్హం. వారంలో పసిడి కదలికలు... కాగా శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి ధర భారీగానే పడింది. అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్‌లో పసిడి ధర ఔన్స్‌కు వారం వారీగా చూస్తే 21 డాలర్లు పడి 1,324 డాలర్ల వద్ద ముగిసింది. వెండి కూడా నష్టాలతో 18.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయంగా ప్రధాన బులియన్ మార్కెట్లో పసిడి 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు వారం వారీగా రూ.335 తగ్గి రూ.31,385 వద్ద ముగిసింది. 99.5 స్వఛ్చత ధర సైతం అంతే స్థాయిలో తగ్గి రూ.31,235కు దిగింది. (డాలర్ మారకంలో రూపాయి విలువ 67.06) ఒత్తిడి ఉంటుంది... సెప్టెంబర్‌లో ఫెడ్ ఫండ్ రేటు నిర్ణయం, ఆర్థిక వ్యవస్థ అందుకు తగిన విధంగా ఉందని ఫెడ్ చైర్మన్ ప్రకటన పసిడి ధరపై ఒత్తిడిని పెంచుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌కు 1,285-1,300 శ్రేణికి పడిపోయే అవకాశాలూ లేకపోలేదు. - ఫృద్వీరాజ్ కొఠారీ, ఎండీ, రిద్దిసిద్ధి బులియన్స్ దేశంలో రూ.30 వేల పైనే... డాలర్ ఇండెక్స్ పెరగవచ్చు. ఇది పసిడిపై ఒత్తిడిని పెంచే అంశమే. అయితే రానున్న పెళ్లిళ్ల సీజన్ పసిడికి దేశీయంగా కొంత పటిష్టతను చేకూర్చే అంశం. భారత్‌లో పసిడి ట్రేడింగ్ సమీప కాలంలో రూ.30,000-రూ.30,500 శ్రేణిలో ఉండవచ్చు. - నవీన్ మాథూర్, ఏంజిల్ బ్రోకింగ్ -
టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మృతి
నేడు వేల్పూర్‌లో అంత్యక్రియలు వేల్పూర్: మిషన్ భాగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తండ్రి టీఆర్ఎస్ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి(74) శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో మరణించారు. ఆయన అనారోగ్యంతో రెండు వారాలుగా స్టార్ అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి, చికిత్స అందించారు. శరీరం సహకరించకపోవడంతో శనివారం మధ్యాహ్నం మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో సురేందర్ రెడ్డి స్వగ్రామం నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఉదయం వేల్పూర్‌లో అంత్యక్రియలు జరుగుతాయని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. 1942 డిసెంబరు 8న వేముల నర్సారెడ్డి, గంగవ్వ దంపతులకు సురేందర్ రెడ్డి జన్మించారు. ఆయనకు ఒక అక్క, ఐదుగురు చెల్లెల్లు ఉన్నారు. వీరిలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన ్నపూర్ణమ్మ ఒకరు. ఆయన విద్యాభ్యాసం హెచ్ఎస్సీ వరకు వేల్పూర్ హైస్కూలులో సాగింది. డిగ్రీ నిజాంకాలేజీలో, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఆయనకు భార్య మంజుల, కొడుకులు వేముల ప్రశాంత్‌రెడ్డి, వేముల అజయ్‌రెడ్డి, కూతురు రాధిక ఉన్నారు. -
15 రోజుల్లోనే ఇద్దరు ఎస్ఐలకు గాయాలు
దొంగల దాడిలో రెండు వారాల వ్యవధిలోనే ఇద్దరు ఎస్ఐలు గాయపడ్డారు. ఇటీవలే దొంగనోట్ల కేసు ఛేదించే క్రమంలో ఎస్ఐ వెంకటరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా శంషాబాద్ వద్ద జరిగిన కేసులో ఎస్సై వెంకటేశ్వర్లు కత్తిపోట్లకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 10.30 ప్రాంతంలో సీసీఎస్ పోలీసులు శంషాబాద్ రింగ్ రోడ్డు ప్రాంతంలో నాకాబందీ చేస్తున్నారు. ఆ సమయంలో చైన్ స్నాచింగ్‌లో ఆరితేరిన శివ సర్వీసురోడ్డులో బైకు మీద వస్తుండగా పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కత్తితో ఎస్ఐ వెంకటేశ్వర్లు మీద దాడికి దిగారు. సీఐ నర్సింహారెడ్డ ఇమూడురౌండ్ల కాల్పులు జరిగాయి. వీపు పైభాగంలో బుల్లెట్ గుర్తులున్నాయి. సంఘనట స్థలంలోనే రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడి సెల్‌ఫోను, బ్యాటరీ, బైకు అక్కడే ఉన్నాయి. రాత్రి 11 గంటల ప్రాంతంలో సంఘటన జరిగింది. అతడు దాడికి పాల్పడటంతో ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామన్నారు. ఆర్డీవో నేతృత్వంలో పంచనామా చేసి, ఉస్మానియాకు తరలించారు. పోస్టుమార్టం చేసిన అనంతరం బంధువులకు అందజేస్తారు. మియాపూర్, కూకట్పల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఇళ్ల ముందు ముగ్గులు వేసేవారు, పువ్వులు కోసేవాళ్లను టార్గెట్‌గా చేసుకుని చైన్ స్నాచింగులకు పాల్పడేవాడు. కొన్ని రోజుల క్రితమే సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు ఓజిలి మండలం ఆర్మేనిపాడుకు కూడా వెళ్లారు. అయితే అతడు ఇక్కడ బీఎన్ మక్తాలో నివాసం ఉన్నట్లు సమాచారం అందింది. సెల్‌ఫోను నెంబర్ దొరకడంతో.. దాని సిగ్నళ్ల ఆధారంగా అతడి ఆచూకీ కనుగొన్నారు.