కేంద్ర ప్రభుత్వం విఫలమైంది | union government fail to provide currency, says jana reddy | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వం విఫలమైంది

Published Fri, Dec 16 2016 1:44 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

కేంద్ర ప్రభుత్వం విఫలమైంది - Sakshi

కేంద్ర ప్రభుత్వం విఫలమైంది

హైదరాబాద్‌: కొత్త కరెన్సీని తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో జానారెడ్డి మాట్లాడుతూ.. నగదు అందుబాటులో లేక పెళ్లిళ్లు ఆగిపోయానని చెప్పారు.

కరెన్సీ సమస్యతో కార‍్మికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జానారెడ్డి పేర్కొన్నారు. సునామీ, తుఫాన్‌ ప్రభావాల కంటే ఎక్కువగా ప్రజలు బాధపడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం చిన్న నోట్లను ఎక్కువగా ముద్రించిన తర్వాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని, అనాలోచితంగా నిర్ణయం తీసుకుందని తప్పుపట్టారు. నగదు రహిత లావాదేవీల కోసం ప్రజలకు శిక్షణ ఇవ్వాలని జానారెడ్డి కోరారు. లక్ష్యసాధనకు తాము కూడా సహకరిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement