
'వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఏపీలోనే'
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ సమావేశాలను ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించాలని భావిస్తున్నానని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. కానీ అసెంబ్లీ సమావేశాల విషయంలో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని చెప్పారు.
సోమవారం స్పీకర్ కోడెల విలేకరులతో మాట్లాడారు. గతంలో కూడా సమావేశాలు ఏపీలో నిర్వహించాలని భావించినట్టు తెలిపారు. అయితే అది సాధ్యపడలేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై దృష్టి సారించాలని స్పీకర్ కోడెల కోరారు.