
సవరణా? కొత్త చట్టమా?
భూసేకరణ బిల్లుపై ఉత్తమ్, జానా, జీవన్‌రెడ్డి ప్రశ్న
- మేం సభలో మాట్లాడకుండా మైక్ కట్‌చేస్తున్నారు
- పార్లమెంటును తాడూబొంగరం లేనిదంటారా?
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన భూ సేకరణ బిల్లుపై కాంగ్రెస్ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. అసెంబ్లీలో పెట్టింది భూ సేకరణ చట్టానికి సవరణా? లేదా కొత్త చట్టం తీసుకువచ్చారా అనే దానిపై ఎక్కడా స్పష్టత లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, డీకే అరుణ, రామ్మోహన్‌రెడ్డితో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంటరీ సాంప్రదాయాల ను, నిబంధనలను అమలు చేయకుండా స్పీక ర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నా రని, ఇది శాసనసభకు బ్లాక్‌డే అని ఉత్తమ్ అన్నారు.
కేంద్రం చట్టానికి సవరణ చేసే అధికారం రాష్ట్రానికి లేదని జానారెడ్డి అనడంతో సీఎం మాటమార్చి కొత్త బిల్లు అన్నారని పేర్కొన్నా రు. ‘‘సవరణ బిల్లు అని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. అది చెల్లదని తేల డంతో సీఎం కొత్త బిల్లు అన్నారు. కొత్త బిల్లును సభలో పెట్ట కుండా, అందులో ఏముందో చర్చించకుండా ఎలా ఆమోదిస్తారు? దీనిపై గందరగోళం ఉం డగానే మాకు మైక్ ఇవ్వకుండా, చర్చించకుం డా, పార్టీల అభిప్రాయాలను, నిరసనలు చెప్ప కుండా, ప్రతిపక్ష సభ్యుల వైపు చూడకుండా స్పీకరు సభను వాయిదా వేయడం అప్రజా స్వామికం. స్పీకర్ తీరుతో శాసనసభ గౌరవం, ప్రతిష్ట దెబ్బతింటోంది’’ అని విమర్శించారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయడం లేదని, న్యాయం కావాలని కోర్టులకు పోవడమే తప్పు అన్నట్టుగా సీఎం మాట్లాడ టం మంచిది కాదన్నారు. దేశానికి ఉన్నతమైన చట్టసభ పార్లమెంటు అని, దాన్నే తాడూ బొంగరం లేనిదంటూ సీఎం మాట్లాడటం అహంకారపూరిత మన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్లమెంటును తాడూబొంగరం లేదన డం దారుణమని జీవన్ రెడ్డి అన్నారు. భూ సేకరణ చట్టం–2013కు అప్పుడు ఎంపీగా ఉ న్న కేసీఆర్ మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు.