హైదరాబాద్: ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచినందున రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కరువు అంశంపై లేఖ రాశారు. రైతు రుణాలపై అసెంబ్లీలో గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. తెలంగాణలో మొత్తం కరవు మండలాలుగా ప్రకటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఉత్తమ్ డిమాండ్ చేశారు.