
'పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం'
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు స్వాగతిస్తున్నామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. డివిజన్ల రిజర్వేషన్ల ముసాయిదా ముందుగా విడుదల చేసి, పార్టీల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతే వాటిని ఖరారు చేయాలని సూచించారు. రిజర్వేషన్లు ప్రకటించాక నామినేష్ల దాఖలకు కనీసం వారం రోజుల గడువు ఉండాలన్నారు.
రిజర్వేషన్లు ఖరారు, నామినేషన్లు దాఖలు చేయడానికి మధ్య వారం గడువు లేకుంటే పార్టీలో చర్చించి ఎన్నికల బహిష్కరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తీరు మయన్మార్, పాకిస్థాన్ లో ఎన్నికల నిర్వహణ మాదిరిగా ఉందని విమర్శించారు. 'గ్రేటర్' ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛాపూరిత వాతావరణంలో జరగాల్సిందేనని డిమాండ్ చేశారు.