'బాబు సర్కార్ వందల కోట్లు లూటీ' | vaasireddy padma criticise babu government on projects issue | Sakshi
Sakshi News home page

'బాబు సర్కార్ వందల కోట్లు లూటీ'

Published Fri, Nov 20 2015 1:51 PM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

'బాబు సర్కార్ వందల కోట్లు లూటీ' - Sakshi

'బాబు సర్కార్ వందల కోట్లు లూటీ'

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ సాగునీటి ప్రాజెక్టు పనుల్లో లూటీ చేస్తోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచి వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పనితీరును ఉన్నతాధికారులు కూడా తప్పుపడుతున్నారని, ప్రభుత్వానికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాశారంటే ఏపీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

ప్రాజెక్టుల విషయంలో వందల కోట్ల రూపాయల కమీషన్లు, ముడుపులు చేతులు మారుతున్నాయని ఆరోపణలు చేశారు. 18 నెలల్లో జరిపిన సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి, లేనిపక్షంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రపంచ బ్యాంకుకు ముద్దుబిడ్డ అని ఆమె వ్యాఖ్యలు చేశారు. వాల్మార్ట్ దోపిడీకి గేట్లు బార్లా తెరవడం దుర్మార్గమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement