దోపిడీ ముఠాల చేతుల్లో ఏపీ
రాష్ట్రాన్ని అవినీతి, నేరాల్లో నంబర్‌వన్ చేసిన బాబు: వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని దోపిడీ ముఠాల చేతుల్లో పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. అవినీతి, నేరాలు, మద్యం అమ్మకాల్లో ఏపీని నంబర్‌వన్‌గా మార్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరులతో వాసిరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్‌లలో ల్యాండ్ సెటిల్‌మెంట్‌లు, బినామీలకు భూములు ఎలా కట్టబెట్టాలన్న ఆలోచనే తప్ప ప్రజా సంక్షేమమే పట్టడం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2016 సంవత్సరం ఏపీ ప్రజలకు కన్నీళ్లను మిగిలిస్తే.. ప్రజలు సంతోషంగా ఉన్నారని చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు.
నైతికంగా పతనమైన టీడీపీ: చంద్రబాబు వైఫల్యం వల్లే ఏపీకి నష్టం జరిగిందని వాసిరెడ్డి మండిపడ్డారు.ప్రజాస్వామ్య విలువలకు నీళ్లు వదిలేసి 21 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీడీపీ నైతికంగా పతనమైందన్నారు.
సమస్యలను అధిగమించాలి..: 2017 సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు తమ సమస్యలను అధిగమించాలని, ఈ క్రమంలో పాలకుల మీద ఒత్తిడి తీసుకువస్తారని ఆశిస్తున్నామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ప్రజా సమస్యలపై మున్ముందు కూడా వైఎస్సార్‌సీపీ పోరాటాలు నిర్వహిస్తుందని, ప్రజల తరఫున ఛాంపియన్‌గా ఉంటుం దన్నారు.