Vasireddi Padma
-
మహిళా ఉద్యోగులపై దాడుల్ని ఉపేక్షించేది లేదు
-
‘హోదా’ ఉద్యమానికిదే సమయం
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు సాక్షి, అమరావతి: ఆంధ్రులకు ఆత్మగౌరవం కావాలో, అబద్ధాలు కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ప్రకటించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలపై పోరాటమే శరణ్యమని తీర్మానించింది. సీఎం, కేంద్రమంత్రుల స్థాయిలోని వ్యక్తులు అబద్ధాలు చెబుతున్నా రని, దీన్ని ప్రజలు క్షమించరని హెచ్చరించింది. ఉద్యమాలపై ఉక్కుపాదం మోపే ప్రభుత్వ తీరు ను ఎదిరించాలని నిర్ణయించింది. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జస్టిస్ లక్ష్మణరెడ్డి అధ్యక్షతన విభజన చట్టం, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. లక్ష్మణరెడ్డి ప్రారంభోప న్యాసం చేస్తూ హోదా తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అంటూ మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శిం చారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ కలసి మోదీ ప్రభుత్వంపై ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అవిశ్వాసం పెట్టాలన్నారు. హోదా కోసం తమ పార్టీ పోరాడుతూనే ఉందనీ ఎంపీల రాజీనామాను ప్రయోగించేందుకు తమ పార్టీ సిద్ధమైందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మఅన్నారు. రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఎంపీ లు రాజీనామా చేస్తే అది పెద్ద చర్యే అవుతుంద న్నారు. ప్రముఖ జర్నలిస్టుకొమ్మినేని శ్రీనివాస రావు మాట్లాడుతూ విశాఖ విమానాశ్రయంలో ఏపీ విపక్ష నేత జగన్‌ను అడ్డు కోవడమంటే ఉద్య మాన్ని చూసి బాబు భయపడడమేనన్నా రు. లోక్‌సత్తా నేత కె.శ్రీనివాస్, రాయలసీమ అభివృ ద్ధి మండలి నేత ఇస్మాయిల్, చార్టెడ్ అకౌంటెంట్ వెంకటరెడ్డి, సీనియర్ జర్నలిస్టు చెన్ను శివప్ర సాద్, టీవీరావు, పోతురాజు శివ ప్రసంగించారు. -
దోపిడీ ముఠాల చేతుల్లో ఏపీ
రాష్ట్రాన్ని అవినీతి, నేరాల్లో నంబర్‌వన్ చేసిన బాబు: వాసిరెడ్డి పద్మ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని దోపిడీ ముఠాల చేతుల్లో పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. అవినీతి, నేరాలు, మద్యం అమ్మకాల్లో ఏపీని నంబర్‌వన్‌గా మార్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరులతో వాసిరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్‌లలో ల్యాండ్ సెటిల్మెంట్లు, బినామీలకు భూములు ఎలా కట్టబెట్టాలన్న ఆలోచనే తప్ప ప్రజా సంక్షేమమే పట్టడం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2016 సంవత్సరం ఏపీ ప్రజలకు కన్నీళ్లను మిగిలిస్తే.. ప్రజలు సంతోషంగా ఉన్నారని చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు. నైతికంగా పతనమైన టీడీపీ: చంద్రబాబు వైఫల్యం వల్లే ఏపీకి నష్టం జరిగిందని వాసిరెడ్డి మండిపడ్డారు.ప్రజాస్వామ్య విలువలకు నీళ్లు వదిలేసి 21 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీడీపీ నైతికంగా పతనమైందన్నారు. సమస్యలను అధిగమించాలి..: 2017 సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు తమ సమస్యలను అధిగమించాలని, ఈ క్రమంలో పాలకుల మీద ఒత్తిడి తీసుకువస్తారని ఆశిస్తున్నామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ప్రజా సమస్యలపై మున్ముందు కూడా వైఎస్సార్సీపీ పోరాటాలు నిర్వహిస్తుందని, ప్రజల తరఫున ఛాంపియన్‌గా ఉంటుం దన్నారు. -
ఎన్‌కౌంటర్‌పై విచారణకు ఆదేశించాలి
తీవ్రవాదానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం: వాసిరెడ్డి పద్మ సాక్షి, హైదరాబాద్: ఏఓబీలో ఈ నెల 24వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణకు ఆదేశించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శుక్రవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తీవ్రవాదానికి వైఎస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకమని, ఏ పోరాటమైనా శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా జరగాలని అన్నారు. ఏవోబీలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్లపై మీడియా, ప్రజాసంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తుండటాన్ని ఆమె ప్రస్తావించారు. ఆయా ఘటనల్లో 30 మంది మావోయిస్టులు, ఒక పోలీసు మరణించగా, మరో పోలీసు గాయపడ్డారని చె బుతూ.. అవి నిజమైన ఎన్కౌంటర్లు కాదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోందని చెప్పారు. -
రాష్ట్రంలో నియంత పాలన
- చంద్రబాబు అసమర్ధత వల్లే రాష్ట్రానికి అన్యాయం - వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. టీడీపీ సర్కార్ దోపిడీని ప్రశ్నిస్తే జర్నలిస్టులను సైతం బెదిరిస్తున్నారని విమర్శించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా జలాల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా మీనమేషాలు లెక్కిస్తూ రైతులకు బాబు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. స్విస్ చాలెంజ్‌పై కోర్టులో వాదనలు వినిపించడానికి ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద అటార్నీ జనరల్‌ను పిలిపిస్తారు కానీ.. రాష్ట్ర ప్రజలకు న్యాయంగా రావాల్సిన నీటి వాటాపై కేంద్రంపై ఒత్తిడి మాత్రం తీసుకురారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతోనే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.స్విస్ చాలెంజ్‌పె హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే హడావుడిగా ఎందుకు ఏపీఐడీఈ చట్టాన్ని సవరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. డెవలపర్ వాటాలకు సంబంధించి వివరాలు చెప్పాల్సి వస్తుందనే చట్టాల్ని మారుస్తూ ఆర్డినెన్స్ ఇచ్చారని, బహిరంగంగా దోపిడీ చేయటానికి తెగబడ్డారని అన్నారు. -
సుజనా మాటలు అబద్ధాల పుట్ట
- కేంద్రం తరపున వకాల్తా పుచ్చుకుంటారా? - వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పిన మాటలన్నీ అబద్ధాల పుట్ట అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆయన అలా ఉత్సాహంగా ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని, కేంద్రం ఇవ్వనంటోందని చెప్పడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్యాకేజీ ఇవ్వనంటున్నారని, అందుకు సమానమైన ధనాన్ని అంచనా వేసి ఇస్తామంటున్నారని కేంద్ర మంత్రి నింపాదిగా చెబుతున్నారన్నారు. ‘డబ్బుకు రంగుండదు’ (మనీ హాస్ నో కలర్) ఏ రూపంలో వస్తే ఏమిటని రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైనా మనీ డీలా? ప్రత్యేక హోదాను ప్రతిబింబించాల్సింది పోయి.. కేంద్రం చెప్పిన మాటలను వల్లె వేస్తూ వారి తరపున సుజనా వకాల్తా పుచ్చుకున్నారని పద్మ ఆరోపించారు. ఇదేమైనా మనీ డీలా.. బేరసారాలు సాగించి రాయబారంలాగా చేసుకోవడానికి? అని ప్రశ్నించారు. ప్యాకేజీ పేరుతో ధనం తెచ్చుకుంటే టీడీపీ ప్రభుత్వానికి, వారి నేతలకు మేలు జరగొచ్చేమోకానీ, రాష్ట్ర ప్రజలకేమీ ఒరిగేదిలేదన్నారు. కేంద్రంలో ఏ మార్పు జరిగినా దాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యేక హోదా ఇవ్వలేమంటున్నారని చంద్రబాబు చెప్పడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ‘ఓటుకు కోట్లు’లో బాబు దొంగే ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోర్టులో గెలిచినా ప్రజల దృష్టిలో మాత్రం దొంగ, దోషిలాగా నిలబ డ్డారని వాసిరెడ్డి పద్మ చెప్పారు. ఈ వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు జరక్కుండా హైకోర్టు స్టే ఇవ్వడంపై ఆమె స్పందిం చారు. కోర్టులకు మించింది ప్రజా కోర్టు అని.. ప్రజల దృష్టిలో చంద్రబాబు నీచుడుగా మిగిలారన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారం ప్రత్యక్షంగా ప్రజల కళ్లల్లో పడిందని ఆమె తెలిపారు. -
మూడోసారి ప్రారంభం ఓ నాటకం
వైఎస్సార్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ధ్వజం సాక్షి, హైదరాబాద్ : పట్టిసీమ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముచ్చటగా మూడోసారి ప్రారంభించడం ఒక నాటకమని, ఇది ముడుపుల కోసం చేపట్టిందే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. బుధవారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్చి 2015లో శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును అదే ఏడాది సెప్టెంబర్‌లో తొలిసారి చంద్రబాబు ప్రారంభించారన్నారు. ఆ సమయంలో నాలుగు పంపులు పని చేస్తాయని చెప్పారన్నారు. ఆ తర్వాత ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పడం కోసం 2016 మార్చిలో మరోసారి ప్రారంభించారన్నారు. మళ్లీ ఇపుడు 24 పంపులతో పని చేయిస్తున్నామని చెబుతూ మూడోసారి ప్రారంభించారన్నారు. ఒక ప్రాజెక్టును ఇన్నిసార్లు ప్రారంభించడం చంద్రబాబుకే చెల్లిందని, ఈ నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇటు ఆన్ చేయగానే.. అటు ఆపేశారు చంద్రబాబు స్విచ్ ఆన్ చేయగానే విడుదలయ్యే నీరు 66 కిలోమీటర్ల తర్వాత ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితిలో కెమెరాలు, వీడియోలతో ప్రచారార్భాటం ముగిశాక ఇంజినీర్లు పంపులను ఆపేశారని పద్మ పేర్కొన్నారు. వెయ్యి కోట్లు ముడుపులు కేవలం ముడుపుల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టారని పద్మ దుయ్యబట్టారు. రూ 1300 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టును ఏడాది గడువు లోపు నిర్మించక పోయినా నిర్మించినట్లు న మ్మించేందుకు ప్రారంభోత్సవాలు చేసి కాంట్రాక్టరుకు 21 శాతం అదనంగా నిధులు చెల్లించారని ఆమె మండిపడ్డారు. ఈ వ్యవహారంలో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని, టీడీపీ పెద్దల జేబుల్లోకి ముడుపులు వెళ్లాయన్నారు. -
అడ్డంగా దొరికి అవాకులా
- ఈడీ తాత్కాలిక ఎటాచ్పై పెడర్థాలు తీస్తారా.. - బాబు అండ్‌కో విషప్రచారంపై వాసిరెడ్డి పద్మ ఫైర్ - ‘ఓటుకు కోట్లు’లో చంద్రబాబు దొరికిపోవడం నిజం కాదా? - రాజధాని, సదావర్తి భూములపై విచారణకు నిలబడే దమ్ముందా.. - అంతిమ విజయం న్యాయానిదే.. అదే జగన్ ధీమా... - న్యాయస్థానాలపై మాకు అచంచల విశ్వాసముంది.. సాక్షి, హైదరాబాద్ : ‘‘తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ ‘ఓటుకు కోట్లు’ కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు ... ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలను కోట్లు పోసి కొనుగోలు చేస్తూ దోషిగా నిలబడింది చంద్రబాబు ... రాజధాని భూములతోపాటు, దేవాలయాలు, సత్రాల భూముల్లో అవినీతికి పాల్పడుతూ కన్నంలో చిక్కిన దొంగ .. అలాంటి చంద్రబాబు మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయడమంటే దొంగే దొంగ, దొంగ అని అరిచినట్లుంది’’ అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. రెండేళ్లలో లక్షన్నరకోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడిన చంద్రబాబు ప్రభుత్వంపై మా పార్టీ సాక్ష్యాలతో సహా ఓ పుస్తకాన్ని ప్రచురిస్తే విచారణకు నిలబడాల్సింది పోయి.. అనుకూల మీడియా సాయంతో తమ పార్టీపై దుష్ర్పచారానికి దిగుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్) బుధవారం రూ 750 కోట్ల విలువ చేసే ఆస్తులను తాత్కాలికంగా ఎటాచ్ చేసిన అంశంపై వచ్చిన వార్తలు, టీడీపీ చేస్తున్న దుష్ర్పచారంపై ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా స్పందించారు. ఎటాచ్మెంట్ అంటే స్వాధీనం కాదు... వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన ఆస్తులను ఈడీ ఎటాచ్మెంట్ చేయడాన్ని టీడీపీ భూతద్దంలో చూపిస్తూ విషప్రచారం చేస్తోందని, ఎటాచ్మెంట్ చేసినంత మాత్రాన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కానే కాదని పద్మ అన్నారు. ఈడీ ఎటాచ్మెంట్ చేయడం అనేది సీబీఐ ఇప్పటికే జగన్‌పై ఉన్న కేసుల్లో దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా జరిగిన ప్రక్రియే తప్ప మరొకటి కాదన్నారు. ఇంత మాత్రానికే జగన్ జైలుకు వెళతారని, నేరం నిర్థారణ అయిందని, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయం మూతపడుతుందని... టీడీపీ నేతలు చేస్తున్న దాడి గర్హనీయమని ఆమె అన్నారు. న్యాయస్థానాలపై జగన్‌కు పూర్తి విశ్వాసం ఉందని, అంతిమంగా న్యాయమే విజయం సాధిస్తుందని ఆయన నమ్ముతున్నారని, అందుకే ధీమాగా పార్టీని నడుపుతున్నారని పద్మ పేర్కొన్నారు. టీడీపీ చేస్తున్న విమర్శలు, వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉంది కనుక తాను ఈ అంశాలపై వివరణ ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుట్రతోనే కేసులు జగన్మోహన్రెడ్డి సీబీఐ వేసిన 11 చార్జిషీట్లపై విచారణ జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని ఆమె అన్నారు. వీటిపై విచారణ జరుగుతోందని ఆమె వివరించారు. రెండేళ్ల పరిపాలనలో ఏమీ చేయలేక పోయిన చంద్రబాబు తన వైఫల్యాలు, అవినీతి కుంభకోణాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈడీ ఎటాచ్‌మెంట్‌ను సాకుగా చేసుకుని విమర్శిస్తున్నారని పద్మ అన్నారు. ముందుంది ముసళ్ల పండుగ గత ఐదేళ్లుగా జగన్‌పై సాగుతున్న కుట్రలు, కేసులు, సీబీఐ విచారణ అవన్నీ ముగిసిపోయిన అధ్యాయమని పద్మ అన్నారు. ఇపుడు ఇక చంద్రబాబుఅవినీతిపై విచారణ జరగాల్సి ఉందని పద్మ అన్నారు. రాజధాని భూముల బాగోతంపైనా, ల్యాండ్‌పూలింగ్ పేరుతో రైతుల నుంచి భూములు లాక్కుని, ‘ఇన్సైడర్ ట్రేడింగ్’కు పాల్పడి తన బినామీలతో భూములను కొనిపించడంపైనా, సదావర్తి భూముల అవినీతిపైనా విచారణ జరగాల్సి ఉందని ఆమె అన్నారు. రాజధాని భూములకు సంబంధించి అసెంబ్లీలో తాము సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తే ముఖ్యమంత్రి, మంత్రులు పారిపోయారన్నారు. మీకు ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. చంద్రబాబు తన ప్రతిష్టను పెంచుకోలేక ఎంత సేపూ జగన్ ప్రతిష్టను దెబ్బతీసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, ఇది రాజకీయాల్లో చేతగాని తనానికి నిదర్శనమని పద్మ పేర్కొన్నారు. జగన్ విషయంలో ఏం జరగనుందో అది జరుగుతుంది, చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణకు సిద్ధపడటం లేదో చెప్పాలి అని పద్మ సూటిగా ప్రశ్నించారు. -
బాబు కోసం లగడపాటి ఆరాటం: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చంద్రబాబుకు లబ్ధి చేకూర్చాలనే తాపత్రయంతోనే టీడీపీ గెలుస్తుందనే ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆదివారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే లగడపాటికి తొలి నుంచే ద్వేషమేనని, అందుకే ఆయనపై విషం చిమ్ముతున్నారని చెప్పారు. జగన్‌పై మూడేళ్ల క్రితం నుంచే లగడపాటి విషం కక్కుతూ మాట్లాడుతున్నారన్నారు. చివరి ప్రయత్నంగా బాబుకు ఉడతా భక్తిగా సాయం చేద్దామని ప్రజాభిప్రాయం పేరిట సీమాంధ్రలో టీడీపీ గెలుస్తుందని లగడపాటి ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ సన్యాసం పుచ్చుకున్నానని ప్రకటించిన లగడపాటి అంతటితో ఊరుకోక అభిప్రాయాల పేరుతో రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని పద్మ ఎద్దేవా చేశారు. సన్యాసం తీసుకోవడం మాటేమిటోగానీ ఆయన మాత్రం ఒక సన్నాసి అని మండిపడ్డారు. -
సిఎం కిరణ్ గారూ సర్వేలు చూసి భయపడుతున్నారా?: గట్టు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారూ సర్వేలు చూసి భయపడుతున్నారా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన రెడ్డిని ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలను గట్టుతోపాటు వైఎస్ఆర్ సిపి నాయకురాళ్లు శోభానాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ ఖండించారు. ఇప్పుడొచ్చిన ఈ ఆవేశం నాలుగు నెలల క్రితం ఏమైందని అడిగారు. సమైక్యం కోసం మీరు చేసిందేమిటి? అని సీఎంను ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ సమైక్య చీడపురుగులని వారు విమర్శించారు. -
కాంగ్రెస్, టీడీపీదే విభజన పాపం
విజయవాడ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రపై ఢిల్లీలో ఒకమాట, రాష్ట్రంలో మరో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ టీడీపీలకు ఉద్యమించే నైతిక హక్కు లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. తెలుగు ప్రజలందరికీ సమన్యాయం చేయాలని లేకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్షకు దిగిన వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డికి మద్దతుగా నగర పాలక సంస్థ స్థాయీ సంఘం మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ నేత జవ్వాది సూర్యనారాయణ (రుద్రయ్య) చేపట్టిన నిరవధిక దీక్ష బుధవారం మూడో రోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ చాలా నిసిగ్గుగా వ్యవహరిస్తున్నాయన్నారు. చంద్రబాబునాయుడు ఒకవైపు తెలంగాణాకు మద్దతుగా లేఖ ఇచ్చారని, మరోవైపు ఆ పార్టీ నేతలు ఇక్కడ ప్రజలను మభ్యపెట్టేందుకు పాకులాడుతున్నారని విమర్శించారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులు కేంద్ర పాలకుల కుయుక్తులను గమనించి ముందుగానే రాజీనామా చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో నిరవధిక దీక్షకు దిగితే అత్యంత దారుణంగా ఆ దీక్షను భగ్నం చేశారని చెప్పారు. నేడు తెలుగు ప్రజల ఆకాంక్షను నిలబెట్టేందుకు జగన్మోహనరెడ్డి జైలులో ఆమరణ దీక్ష ప్రారంభించారని తెలిపారు. ఆయనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పారు. విజయవాడలో జవ్వాది రుద్రయ్య ఆమరణ దీక్షకు దిగడం అభినందనీయమన్నారు. పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, సెంట్రల్ నియోజకవర్గ కన్వీనర్ పీ.గౌతంరెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజలను విడదీయడానికి కాంగ్రెస్, టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయన్నారు. పార్టీ అధికార ప్రతినిధి దాసీజయప్రకాష్కెనడీ, ప్రచార విభాగ కన్వీనర్ కంది గంగాధరరావు, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ విశ్వనాధ రవి, వాణిజ్య విభాగ కన్వీనర్ కొనిజేటి రమేష్, నాయకులు దాడి అప్పారావు, కంపా గంగాధరరెడ్డి, మనోజ్‌కొఠారి, వరకాల జోషి, కరిముల్లా, గౌరి, రామిరెడ్డి, మాడెం దుర్గారావు, సుందర్‌పాల్, ముంతాజ్, కడవకొలు కుమారి, మేకల రాణి పాల్గొన్నారు. పలువురి మద్దతు... జవ్వాది రుద్రయ్య దీక్షకు పలువురు సంఘీభావం ప్రకటించారు. విజయవాడ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ నేతలు, వ్యాపారులు భారీ ప్రదర్శనగా దీక్షా శిబిరానికి తరలివచ్చారు. ఆ సంఘం నేతలు ఆరుమళ్ళ వెంకటేశ్వరరెడ్డి, పిన్నిటి రామారావు తదితరులు రిలేదీక్షలో పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతాడ బ్రహ్మనందం జవ్వాదిని పరామర్శించి సంఘీభావాన్ని తెలిపారు. వారితో పాటుగా రిలేదీక్షల్లో మనోజ్‌కొఠారి, దాడి తేజోకుమార్, సరోజనమ్మ, రమణమ్మ , ఆడి సింహచలం, పీ.సత్యనారాయణ, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.