ఎన్‌కౌంటర్‌పై విచారణకు ఆదేశించాలి
తీవ్రవాదానికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం: వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: ఏఓబీలో ఈ నెల 24వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణకు ఆదేశించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శుక్రవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తీవ్రవాదానికి వైఎస్సార్‌సీపీ పూర్తిగా వ్యతిరేకమని, ఏ పోరాటమైనా శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా జరగాలని అన్నారు.
ఏవోబీలో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లపై మీడియా, ప్రజాసంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తుండటాన్ని ఆమె ప్రస్తావించారు. ఆయా ఘటనల్లో 30 మంది మావోయిస్టులు, ఒక పోలీసు మరణించగా, మరో పోలీసు గాయపడ్డారని చె బుతూ.. అవి నిజమైన ఎన్‌కౌంటర్లు కాదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోందని చెప్పారు.