జనసమ్మతమై విలసిల్లుతున్న భాగ్యనగరికి క ‘న్నీటి’ కష్టం తప్పేలా లేదు. భవిష్యత్ మరింత భారం కానుంది. గ్రేటర్ జనాభా అనూహ్యంగా పెరుగుతుండడంతో మంచినీటికి అంతకంతకూ డిమాండ్ పెరుగుతోంది. కొత్తకాలనీలు, బస్తీలు వేలాదిగా అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడ మంచినీటి సరఫరా నెట్‌వర్క్ లేకపోవడంతో లక్షలాది మంది గొంతెండుతోంది. ప్రస్తుతం జలమండలి కృష్ణా మూడు దశలు, గోదావరి, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల నుంచి సేకరిస్తున్న 365 మిలియన్ గ్యాలన్ల నీటిని సిటీలోని 8.64 లక్షల నల్లాలకు సరఫరా చేస్తోంది. కానీ నీటి డిమాండ్ 732.43 ఎంజీడీలు.
అంటే రోజు వారీగా నీటి కొరత 367.43 ఎంజీడీలు. ఇదే క్రమంలో 2021 నాటికి జనాభా 1.92 కోట్లకు చేరువ కానుంది. అప్పుడు నీటి డిమాండ్ 986.82 ఎంజీడీలు. కానీ అప్పటికీ సరఫరా 732.43 ఎంజీడీలు మాత్రమే. కొరత 255.84 ఎంజీడీలు ఉండబోతోంది. 2031 నాటికి జనాభా అంచనా 2.82 కోట్లు. నీటి డిమాండ్ 1447.61 ఎంజీడీలు. కానీ సరఫరా 1072.30 ఎంజీడీలు మాత్రమే ఉండనుంది. ఇదే క్రమంలో 2041 నాటికి జనాభా 3.72 కోట్లకు చేరువయ్యే అవకాశాలున్నాయి. అప్పుడు నీటి డిమాండ్ 1908.39 ఎంజీడీలకు చేరుకోనుంది. కానీ సరఫరా 1413.62 ఎంజీడీలు మాత్రమే. అంటే భవిష్యత్‌లో నగరవాసులకు కన్నీటి కష్టాలు తప్పే పరిస్థితి లేదు.
- సాక్షి, సిటీబ్యూరో
క‘న్నీటి’ కష్టం..
Published Thu, Jan 14 2016 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM
Advertisement