మతోన్మాద అంతానికి సిద్ధం కావాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న అప్రజాస్వామిక పోకడలు, మతోన్మాదం అంతానికి జనసేవ దళ్ వలంటీర్లు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ, ఏఐవైఎఫ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మూడ్రోజుల జనసేవదళ్ వలంటీర్ల శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సమావేశానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలమల్లేశ్, ఐలయ్యగౌడ్ పాల్గొన్నారు.