మరో భేటీలో తేలుద్దాం!
- గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణ, పరిధిపై ఇరు రాష్ట్రాల నిర్ణయం
- బోర్డు వర్కింగ్ మాన్యువల్ పై చర్చ.. ‘కృష్ణా’ తరహాలో రూపకల్పన
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ, పరిధిపై వచ్చే నెలలో తుది భేటీ నిర్వహించి వర్కింగ్ మాన్యువల్ ఖరారు చేయాలని గోదావరి బోర్డు సమక్షంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిర్ణరుుంచారుు. డిసెం బర్ 15లోగా గోదావరితో పాటే కృష్ణా బోర్డును కలిపి సంయుక్తంగా సమావేశం నిర్వహించి బోర్డుల విధివిధానాలను కొలిక్కి తెచ్చుకోవాలని అంగీకారానికి వచ్చారుు. బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి బోర్డు పరిధి, ప్రాజెక్టుల నియం త్రణ, నిర్వహణ, అధికారుల కేటారుుంపు, బడ్జెట్ అవసరాలు, బోర్డు మార్గదర్శకాలు, విధివిధానాలపై 4 గంటల పాటు బోర్డు సమావేశం జరిగింది. సమావేశానికి బోర్డు చైర్మన్ రామ్‌శరణ్, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్‌కే జోషి, శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వర్‌రావు హాజరయ్యారు. వర్కింగ్ మాన్యువల్‌పై చర్చ జరుగుతున్న దృష్టా కృష్ణా బోర్డు అధికారులూ సమావేశానికి హజరయ్యారు.
బోర్డు పరిధిలోకి అక్కర్లేదు...
తెలంగాణలోని ఎస్సారెస్పీ, నిజాం సాగర్, కడెం, అలీసాగర్, సింగూర్, లోయర్ మానేరు ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపడుతున్న ప్రాణహిత, కాళేశ్వరం, తుపాకులగూడెం, సదర్‌మఠ్, సీతారామ, భక్తరామదాస ప్రాజెక్టులను తమ పరి ధిలోకి తేవాలని బోర్డు సూచించగా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులేవీ లేవని, ప్రస్తుత అవసరాలకు తగినట్లు పాత ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేస్తున్నామని స్పష్టం చేసింది. అరుుతే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి ఉన్న అన్ని ప్రాజెక్టులు బోర్డు పరిధిలో ఉండాలని ఏపీ కోరినట్లు తెలిసింది.
తెలంగాణ స్పందిస్తూ.. ఏపీ చేపట్టిన తాడిపుడి, పుష్కర, వెంకటనగరం, పట్టిసీమ, భూపాలపాలెం ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని సూచించినట్లుగా సమాచారం. బోర్డు వర్కింగ్ మ్యాన్యువల్ ఖరారైతేనే ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున దానిపై దృష్టి సారిద్దా మని బోర్డు సభ్యులు సూచించారు. కృష్ణా వర్కింగ్ మాన్యువల్‌ను అనుసరించి గోదావరి పై డ్రాఫ్ట్ మాన్యువల్‌ను ఇరు రాష్ట్రాలకు త్వరలో పంపిస్తామని, రాష్ట్రాల అభిప్రాయా లు స్వీకరించి డిసెంబర్ 15లోగా నిర్వహించే సమావేశంలో ఖరారు చేద్దామని సూచించిం చగా ఏపీ, తెలంగాణ సమ్మతించారుు. మరోవైపు రెండేళ్ల కాల పరిమితితో పనిచేసేం దుకు డిప్యుటేషన్‌పై అధికారులు కేటారుుం చాలన్న బోర్డు వినతికి అంగీకారం తెలిపారుు.
రూ.4 కోట్ల టెలీమెట్రీకి ఏపీ ఓకే
కృష్ణా బేసిన్‌లోని నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల్లో గుర్తించిన 18 చోట్ల టెలీమెట్రీ పరికరాలను అమర్చ డానికి రూ.4 కోట్లు ఇచ్చేందుకు ఏపీ అంగీ కరించింది. త్వరలోనే టెండర్లు ఖరారు చేసి, నీటి వినియోగాన్ని కచ్చింతగా లెక్కి స్తామని బోర్డు హామీ ఇచ్చింది.