Godavari Basin Project
-
ప్రాజెక్టుల అప్పగింతపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టులను ఆయా బోర్డులకు అప్పగించే విషయం ఎటూ తేలడం లేదు. బోర్డుల భేటీలో నిర్ణయించిన మేరకు తొలిదశలో గుర్తించిన ప్రాజెక్టులను స్వాధీనం చేయాల్సి ఉన్నా తెలంగాణ తేల్చక పోవడంతో పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. గెజిట్ నోటిఫికేషన్ అమలుకు వీలుగా గోదావరి బేసిన్‌లోని పెద్దవాగును అప్పగిం చాలని తెలంగాణకు గోదావరి బోర్డు ఇప్పటికే లేఖ రాసింది. కృష్ణా బేసిన్ ఔట్లెట్ల అప్పగింతపై ఒకట్రెండు రోజుల్లో కృష్ణా బోర్డు కూడా లేఖ రాయనున్నట్టు తెలిసింది. కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లపై ప్రతిపాదించిన 15 ఔట్లెట్లలో 9 తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి. అయితే ఇందులో శ్రీశైలం, నాగార్జున సాగర్‌పై ఉన్న 3 పవర్‌హౌస్‌లను అప్పగించేది లేదని తెలంగాణ తొలినుంచీ చెబుతోంది. బచావత్ అవార్డుకు విరుద్ధం ఈ ఔట్లెట్ల ఆపరేషన్ ప్రోటోకాల్‌పై రాష్ట్రం ఓ కమిటీని నియమించింది. కాగా ఆ కమిటీ ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కృష్ణా బోర్డు తెరపైకి తెచ్చిన మార్గదర్శకాలు బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయపడింది. కమిటీ అభిప్రాయాలను రాష్ట్రం బోర్డుకు తెలియజేసింది. కృష్ణా నీటి పంపిణీ, వినియోగం, ప్రాజెక్టుల ఆపరేషన్‌న్ ప్రొటోకాల్‌పై నిర్దిష్టమైన విధానాన్ని బచావత్ ఇప్పటికే స్పష్టీకరించిన నేపథ్యంలో దానినే బోర్డు అమలు చేయాలని డిమాండ్ చేసింది. బోర్డు రూపొందించిన మార్గదర్శకాలు, నిర్వహణ విధానంలో అవసరమైన మార్పులు చేయాలని కోరింది. దీనిపై బోర్డులు ఎలాంటి వైఖరిని వెల్లడించలేదు. కానీ ఇటీవలే గోదావరి బేసిన్‌లోని పెద్దవాగు ప్రాజెక్టును అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్‌కు లేఖ రాశారు. మరోవైపు ఔట్లెట్ల అప్పగింతపై కృష్ణా బోర్డు కూడా ఒకట్రెండు రోజుల్లో లేఖ రాయనున్నట్టు తెలిసింది. అనంతరం తెలంగాణ స్పందించే తీరునుబట్టి తదుపరి కార్యాచరణను చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా గత బోర్డు భేటీలో తీర్మానించిన మేరకు ప్రాజెక్టులను తమకు అప్పగించాలనే అంశంపై సోమవారం బోర్డు సభ్య కార్యదర్శి, ఇతర సభ్యుల వద్ద కొంత కసరత్తు జరిగింది. ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌ను బోర్డు పరిధిలోకి తెండి రాజోలిబండ హెడ్‌వర్క్స్‌ను సైతం కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం బోర్డుకు లేఖ రాశారు. గెజిట్ నోటిఫికేషన్ అమల్లో భాగంగా ప్రాజెక్టుల అప్పగింతపై కొన్ని ప్రాజెక్టులను గుర్తించినప్పటికీ అందులో తెలంగాణ, ఏపీలకు అవతలగా ఉందంటూ ఆర్డీఎస్ హెడ్ వర్క్స్‌ను బోర్డు పరిధి లోకి తేలేదని లేఖలో పేర్కొన్నారు. ఆర్డీఎస్ కింద 15.90 టీఎంసీల మేర తెలంగాణ రాష్ట్రానికి వాడుకునే అవకాశం ఉందని, దీనిద్వారా 87,500 ఎకరాల ఆయకట్టు పారాల్సి ఉందని గుర్తు చేశారు. అయితే ఎన్నడూ తెలంగాణకు తగినంత నీరు రాలేదని, గడిచిన 15 ఏళ్లుగా కాల్వల ఆధునికీకరణ చేయాలని కోరుతున్నా.. ఏపీ సహకరించకపోవడంతో ఆ పనులు ముందుకు కదలడం లేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రం వాటా ఇప్పించాలని కోరారు. -
Telangana: భారీ వర్షాలు.. ప్రాజెక్టులన్నీ ఫుల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో నదుల్లో ప్రవాహాలు పోటెత్తుతున్నాయి. గోదావరి నది అయితే ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జూలైలోనే శ్రీరాంసాగర్ సహా గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. గోదావరి, ఉప నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. మరోవైపు కృష్ణా బేసిన్లోనూ ప్రవాహాలు పెరిగాయి. ఎగువన కర్ణాటకలోని ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వస్తున్న వరద అంతా శ్రీశైలం, నాగార్జునసాగర్ వైపు ప్రవహిస్తోంది. కేంద్ర జల సంఘం పరీవాహక రాష్ట్రాలకు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేసింది. గోదావరిలో ఫుల్ ఎగువ రాష్ట్రాల నుంచి పెరిగిన ప్రవాహాలు ఓవైపు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మరోవైపు నదులకు వరద పెరిగింది. గోదావరిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండిపోయింది. గురువారం సాయంత్రానికి ప్రాజెక్టులో 90 టీఎంసీల సామర్థ్యానికిగాను 89.76 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మూడు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో.. 36 గేట్లు ఎత్తి ఐదు లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ వరద కాళేశ్వరం బ్యారేజీలను దాటి దిగువకు వెళ్లనుంది. ఇప్పటికే ప్రాణహిత ఉధృతితో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. 35 గేట్లు ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రవాహాలు చేరితే మొత్తం గేట్లన్నీ ఎత్తివేయనున్నారు. మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీరు కృష్ణాలో జోష్: కృష్ణా నదిలో ఎగువన కర్ణాటక ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్ నిండిపోయాయి. నారాయణపూర్ నుంచి లక్షా 28 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాల, శ్రీశైలానికి వరద పెరుగుతోంది. గురువారం సాయంత్రానికి జూరాలకు 70 వేల క్యూసెక్కులు వస్తుండగా.. 69 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి 63 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా.. నీటి నిల్వ 215 టీఎంసీల సామర్థ్యానికిగాను 72.05 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం నుంచి 21 వేల క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి. కర్ణాటకలో భారీ వర్షాలు పడుతుండటంతో కృష్ణానదిలో ఒకట్రెండు రోజుల్లో మూడు నాలుగు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర జల సంఘం అంచనా వేసింది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నిండిపోవడంతో ఆరు గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. రాష్ట్రంలో మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. గోదావరి బేసిన్‌లోని 28, కృష్ణా బేసిన్‌లోని 8 ప్రాజెక్టులు నిం డాయి. అలాగే చెరువులు అలుగు దుంకుతున్నా యి. గురువారం నాటికి 4,698 చెరువులు నిండిపో గా మరో 7,574 చెరువులు నిండిపోయే దశకు చేరా యి. మరో 9 వేలకుపైగా చెరువులు సగానికిపైగా నిండినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. -
ఏకపక్షంగా బోర్డు పరిధి నిర్ణయించొద్దు
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్ ప్రాజెక్టులను తన పరిధిలోకి తెచ్చుకునేలా సిద్ధం చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రతిపాదనలను కేంద్రానికి పంపొద్దని తెలంగాణ ప్రభుత్వం గోదావరి బోర్డుకు విన్నవించింది. ఏక పక్షంగా బోర్డు పరిధిని నిర్ణయించడం సమంజసం కాదని, ఇది పునర్విభజన చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం బోర్డుకు లేఖ రాసింది. గోదావరి బేసిన్లో తెలంగాణ, ఏపీల మధ్య ఎలాంటి ఉమ్మడి ప్రాజె క్టులు లేవని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు లేక ఇరు రాష్ట్రాల మధ్య సంయుక్తంగా నిర్మించిన ప్రాజెక్టుల్లేవని పేర్కొంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్–87 ప్రకారం గతంలో ఉన్న అవార్డులు, అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం–1956 మేరకు ఏర్పడ్డ ట్రిబ్యునల్ల తీర్పులకు లోబడి కేంద్రం బోర్డుల పరిధిని నోటిఫై చేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది. అయితే గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకోవడానికి సంబంధించి ఎలాంటి అంశాల్లేవని పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త మార్గదర్శకాలను తెలంగాణ, ఏపీలోని గోదావరి ప్రాజెక్టులపై రుద్దరాదని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్–85 ప్రకారం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బోర్డు సమావేశంలో చర్చించాలని, అయితే గోదావరి బోర్డు చైర్మన్ ఏకపక్షంగా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించడం సమంజసం కాదని పేర్కొంది. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని తెలిపింది. వీటిని పరిగణనలోకి తీసుకొని తక్షణమే బోర్డు పరిధిని ఖరారు చేయాలని పంపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విన్నవించింది. -
మరో భేటీలో తేలుద్దాం!
-
మరో భేటీలో తేలుద్దాం!
- గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణ, పరిధిపై ఇరు రాష్ట్రాల నిర్ణయం - బోర్డు వర్కింగ్ మాన్యువల్ పై చర్చ.. ‘కృష్ణా’ తరహాలో రూపకల్పన సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ, పరిధిపై వచ్చే నెలలో తుది భేటీ నిర్వహించి వర్కింగ్ మాన్యువల్ ఖరారు చేయాలని గోదావరి బోర్డు సమక్షంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిర్ణరుుంచారుు. డిసెం బర్ 15లోగా గోదావరితో పాటే కృష్ణా బోర్డును కలిపి సంయుక్తంగా సమావేశం నిర్వహించి బోర్డుల విధివిధానాలను కొలిక్కి తెచ్చుకోవాలని అంగీకారానికి వచ్చారుు. బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి బోర్డు పరిధి, ప్రాజెక్టుల నియం త్రణ, నిర్వహణ, అధికారుల కేటారుుంపు, బడ్జెట్ అవసరాలు, బోర్డు మార్గదర్శకాలు, విధివిధానాలపై 4 గంటల పాటు బోర్డు సమావేశం జరిగింది. సమావేశానికి బోర్డు చైర్మన్ రామ్‌శరణ్, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్కే జోషి, శశిభూషణ్ కుమార్, ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు హాజరయ్యారు. వర్కింగ్ మాన్యువల్‌పై చర్చ జరుగుతున్న దృష్టా కృష్ణా బోర్డు అధికారులూ సమావేశానికి హజరయ్యారు. బోర్డు పరిధిలోకి అక్కర్లేదు... తెలంగాణలోని ఎస్సారెస్పీ, నిజాం సాగర్, కడెం, అలీసాగర్, సింగూర్, లోయర్ మానేరు ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపడుతున్న ప్రాణహిత, కాళేశ్వరం, తుపాకులగూడెం, సదర్‌మఠ్, సీతారామ, భక్తరామదాస ప్రాజెక్టులను తమ పరి ధిలోకి తేవాలని బోర్డు సూచించగా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులేవీ లేవని, ప్రస్తుత అవసరాలకు తగినట్లు పాత ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్ చేస్తున్నామని స్పష్టం చేసింది. అరుుతే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి ఉన్న అన్ని ప్రాజెక్టులు బోర్డు పరిధిలో ఉండాలని ఏపీ కోరినట్లు తెలిసింది. తెలంగాణ స్పందిస్తూ.. ఏపీ చేపట్టిన తాడిపుడి, పుష్కర, వెంకటనగరం, పట్టిసీమ, భూపాలపాలెం ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని సూచించినట్లుగా సమాచారం. బోర్డు వర్కింగ్ మ్యాన్యువల్ ఖరారైతేనే ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున దానిపై దృష్టి సారిద్దా మని బోర్డు సభ్యులు సూచించారు. కృష్ణా వర్కింగ్ మాన్యువల్‌ను అనుసరించి గోదావరి పై డ్రాఫ్ట్ మాన్యువల్‌ను ఇరు రాష్ట్రాలకు త్వరలో పంపిస్తామని, రాష్ట్రాల అభిప్రాయా లు స్వీకరించి డిసెంబర్ 15లోగా నిర్వహించే సమావేశంలో ఖరారు చేద్దామని సూచించిం చగా ఏపీ, తెలంగాణ సమ్మతించారుు. మరోవైపు రెండేళ్ల కాల పరిమితితో పనిచేసేం దుకు డిప్యుటేషన్‌పై అధికారులు కేటారుుం చాలన్న బోర్డు వినతికి అంగీకారం తెలిపారుు. రూ.4 కోట్ల టెలీమెట్రీకి ఏపీ ఓకే కృష్ణా బేసిన్‌లోని నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల్లో గుర్తించిన 18 చోట్ల టెలీమెట్రీ పరికరాలను అమర్చ డానికి రూ.4 కోట్లు ఇచ్చేందుకు ఏపీ అంగీ కరించింది. త్వరలోనే టెండర్లు ఖరారు చేసి, నీటి వినియోగాన్ని కచ్చింతగా లెక్కి స్తామని బోర్డు హామీ ఇచ్చింది. -
‘తుమ్మిడిహెట్టి’ ఎత్తిపోతలే
అది గ్రావిటీ పథకం కాదు ♦ ప్రాణహిత డిజైన్ మార్పుపై ప్రభుత్వ సలహాదారు వివరణ ♦ ప్రాజెక్టుకు ఇంకా చాలా అనుమతులు రాలేదు ♦ ప్రాణహిత, ఇంద్రావతి నీటితో ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూరు ఆయకట్టు స్థిరీకరణ సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల పాత డిజైన్ మేరకు ఆదిలాబాద్ జిల్లా కౌటాల వద్ద నిర్మించనున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ గ్రావిటీ పథకం కాదని ఎత్తిపోతల పథకమని రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల విభాగం సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు శనివారం వివరణ ఇచ్చారు. గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులు ఒకవేళ ఎండిపోతే ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి మాత్రమే తెలంగాణ ప్రాంతాన్ని రక్షించగలవని, ఈ నీటిని వినియోగంలోకి తెచ్చే ఉద్దేశంతోనే ప్రాజెక్టు రీడిజైన్ జరుగుతోందని పేర్కొన్నారు. బ్యారేజీలపై మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందంతోపాటు ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించేందుకు అంగీకరించడం, ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ బ్యారేజీని 103 మీటర్ల ఎత్తులో నిర్మించాలన్న ప్రతిపాదనపై వ్యక్తమవుతున్న విమర్శలపై విద్యాసాగర్‌రావు ఈ మేరకు వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు... గోదావరిపై ఎగువ రాష్ట్రం అక్రమంగా చేపట్టిన వందలాది కట్టడాల వల్ల ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుకు నీరు రాక ఆట స్థలాలుగా మారాయి. భవిష్యత్తులో ఉధృతంగా వరదలు వస్తే తప్ప ఈ ప్రాజెక్టుల్లో నీరు కనబడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రాణహిత, ఇంద్రావతి ఉపనదులు మాత్రమే తెలంగాణను రక్షించగలవు. ఈ ఉప నదుల్లో 75 శాతం డిపెండబులిటీ ప్రకారం 700 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. ఈ నీటిని గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు, అదనంగా పాత ప్రాజెక్టుల స్థిరీకరణకు మళ్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే తుమ్మిడిహెట్టి ద్వారా ఆదిలాబాద్‌లో ఉపయోగించుకునే 20 టీఎంసీలు పోనూ మిగిలిన 140 టీఎంసీలను మేడిగడ్డ, ఇంద్రావతి ద్వారా నీటిని లిఫ్ట్ చేసి తుపాకులగూడెం బ్యారేజీ ద్వారా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తుమ్మిడిహెట్టి ద్వారా ఆదిలాబాద్‌లో 2 లక్షల ఎకరాలు, మిగిలిన 14.40 లక్షల ఎకరాలకు మేడిగడ్డ ద్వారా ఎల్లంపల్లి నీటిని తరలించి సాగునీరు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూరు ఆయకట్టు స్థిరీకరణ కోసం ఇంద్రావతి నీటిని తుపాకులగూడెం ద్వారా లిఫ్టు చేసి మేడిగడ్డ ద్వారా వినియోగించుకోనున్నాం. అలాగే ఎస్సారెస్పీ ఫేజ్-2 ఆయకట్టుకు సైతం ఇంద్రావతి నీటినే ఉపయోగించుకుంటాం. పాత ప్రాజెక్టు డిజైన్ మేరకు 7 జలాశయాల ద్వారా 14.7 టీఎంసీలను మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండగా తాజా డిజైన్‌తో 130 టీఎంసీల నిల్వ సామర్థ్యంగల రిజర్వాయర్లు ఏర్పాటవుతున్నాయి. విమర్శకులు అభిప్రాయపడుతున్నట్లుగా ప్రాణహిత ప్రాజెక్టుకు ఏవో కొన్ని తప్ప చాలా అనుమతులు రాలేదు. కేంద్ర జలవనరులశాఖకు సంబంధించి సాంకేతిక సలహా కమిటీ, కేంద్ర పర్యావరణ, అటవీ, గిరిజన వ్యవహారాలశాఖల నుంచి అనుమతులు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద తొందరగా పూడిక చేరే ప్రమాదం ఉందన్నది వాస్తవం కాదు. వరదలతోపాటు గేట్ల నిర్వహణతో పూడిక దిగువకు చేరుతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల ఏపీ రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లదు. గోదావరి జలాల్లో ఆం ధ్రప్రదేశ్‌కు నికరంగా లభించిన 530 టీఎంసీల వాటాను సక్రమంగా బట్వాడా చేసే బాధ్యతను గోదావరి బోర్డు చూసుకుంటుంది.