గోదావరి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ, పరిధిపై వచ్చే నెలలో తుది భేటీ నిర్వహించి వర్కింగ్ మాన్యువల్ ఖరారు చేయాలని గోదావరి బోర్డు సమక్షంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిర్ణరుుంచారుు. డిసెం బర్ 15లోగా గోదావరితో పాటే కృష్ణా బోర్డును కలిపి సంయుక్తంగా సమావేశం నిర్వహించి బోర్డుల విధివిధానాలను కొలిక్కి తెచ్చుకోవాలని అంగీకారానికి వచ్చారుు. బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి బోర్డు పరిధి, ప్రాజెక్టుల నియం త్రణ, నిర్వహణ, అధికారుల కేటారుుంపు, బడ్జెట్ అవసరాలు, బోర్డు మార్గదర్శకాలు, విధివిధానాలపై 4 గంటల పాటు బోర్డు సమావేశం జరిగింది. సమావేశానికి బోర్డు చైర్మన్ రామ్‌శరణ్, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్‌కే జోషి, శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వర్‌రావు హాజరయ్యారు. వర్కింగ్ మాన్యువల్‌పై చర్చ జరుగుతున్న దృష్టా కృష్ణా బోర్డు అధికారులూ సమావేశానికి హజరయ్యారు.