పోలవరం ప్రాజెక్టుకు చిక్కులు ఒక్కొక్కటిగా తొలగుతున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ అధ్యయనం పూర్తి చేసింది. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఆర్కే జైన్, పోలవరం ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ ప్రాజెక్టు మోనిటరింగ్ యూనిట్ (పీఎంయూ) చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉన్న రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ (ఆర్‌ఈసీ) సమావేశం కానుంది.