వైద్యశాఖలో 1,775 పారామెడికల్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది మేలో అనుమతినిచ్చిన ప్రభుత్వం వాటిని టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. విద్యార్హతలు, ఎంపిక పద్ధతిపై స్పష్టత లేకపోవడంతో పోస్టుల భర్తీ విషయంలో విధానాలను నిర్దిష్టంగా తెలపాలని టీఎస్‌పీఎస్సీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో వైద్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంప గా వాటిని ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వోద్యోగాల భర్తీలో కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రా« దాన్యత ఇవ్వరాదనే ప్రభుత్వ సర్వీసు నిబంధనల్లోని 9బి అంశాన్ని ఈ పోస్టుల భర్తీకి మినహాయించింది. వైద్య శాఖలో పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, రేడియోగ్రాఫర్, గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్, గ్రేడ్–2 ఫార్మసిస్ట్, ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఏ(ఎఫ్), ఫిజియోథెరపిస్ట్ పోస్టుల్లో ఎక్కువ మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు.
కాంట్రాక్టు సర్వీసుకు వెయిటేజీ మార్కులు
Published Sun, Sep 10 2017 2:26 AM | Last Updated on Tue, Sep 12 2017 2:22 AM
- 1,775 పారా మెడికల్ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు జారీ
- టీఎస్‌పీఎస్సీ ద్వారానే స్టాఫ్ నర్సు, ఏఎన్‌ఎం ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: వైద్య సేవల్లో కీలకమైన పారామెడికల్ పోస్టుల భర్తీలో నెలకొన్న అయోమయానికి తెరపడింది. పోస్టులవారీగా అర్హతలు, ఎంపిక విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. పోస్టుల భర్తీలో కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజీ మార్కులు కలపాలని నిర్ణయించింది. విద్యార్హతలు, ఎంపిక పద్ధతులను ఖరారు చేస్తూ మార్గదర్శకాలు రూపొందించింది. కాంట్రాక్టు పద్ధతిలో వరుసగా 6 నెలలు పని చేసిన వారికే వెయిటేజీ మార్కులు ఉంటాయని పేర్కొంది. క్రమశిక్షణారాహిత్యంతో కాంట్రాక్టు సర్వీసు నుంచి తొలగించిన వారికి వెయిటేజీ మార్కులు ఉండవని స్పష్టం చేసింది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పని చేసిన వారికి అదనంగా వెయిటేజీ మార్కులు ఉంటాయని, పని చేసిన కాలానికి తగినట్లుగా మార్కుల కేటాయింపు ఉంటుందని తెలిపింది.

Advertisement
Advertisement