తరతరాల నుంచి మానవ సమాజ పురోగతి అంతా మానవుడు అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించడంపై ఆధారపడి ఉంది. ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి, సమాజాభివృద్ధి అనే దృగ్విషయాలు అభివృద్ధితో మిళితమై ఉంటాయి. ‘అభివృద్ధి భావనలు’ అనే పాఠ్యాంశంలో వివిధ రకాల అభివృద్ధిని విద్యార్థులకు అర్థమయ్యేటట్లుగా విశ్లేషించారు.
అభివృద్ధి భావనలు, లక్ష్యాలు, ప్రామాణికాలను సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా గణాంకాలు, పట్టికలు, కథనాలను పొందుపర్చారు. ఈ పాఠాన్ని అధ్యయనం చేయడం ద్వారా విద్యార్థులు ఆర్థికాభివృద్ధి, మానవాభివృది ్ధపరస్పరం ఎలా తోడ్పడతాయో తెలుసుకుంటారు. తద్వారా దేశ సర్వతోముఖాభివృద్ధి సాధనకు ఎలా కృషి చేయాలో అవగాహన పెంచుకుంటారు.
అభివృద్ధి భావనలు
అభివృద్ధి గురించి వివరించడం సంక్లిష్టైమైన పని. ప్రజల అభివృద్ధి వారి వైయక్తిక కోరికలు, ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. అవి వేర్వేరు వ్యక్తులకు సంబంధించి వేర్వేరుగా ఉన్నా అంతిమంగా వారి జీవన నాణ్యతను మెరుగ్గా ఉంచడానికి సోపానాలుగా ఉపయోగపడతాయి. ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, భద్రత, సరైన ఆదాయం ఉన్న వివక్షత లేని అభివృద్ధిని కోరుకుంటారు. ప్రజల సమున్నత లక్ష్యాలను నెరవేర్చడానికి ప్రభుత్వాలు కృషి చేస్తాయి. స్థానిక వనరులు, విద్యా, ఆరోగ్య వసతులు, వివిధ ప్రజాసంక్షేమ సదుపాయాల అభివృద్ధి లాంటి లక్ష్యాల సాధనకు ప్రభుత్వాలు వెన్నుదన్నుగా ఉంటాయి.
ముఖ్యాంశాలు
పరిణామక్రమంలో 2 లక్షల ఏళ్ల క్రితమే ఆహార సేకరణ కోసం వేటను వృత్తిగా ఎంచుకున్నాడు మానవుడు. 12 వేల సంవత్సరాలకు పూర్వమే వ్యవసాయం చేయడం ఆరంభించాడు. 400 ఏళ్ల కిందట పారిశ్రామికీకరణ ప్రారంభమైంది.
తమిళనాడు తీర ప్రాంతంలో ఉన్న ‘కుడంకుళం’ (తిరునల్వేలి జిల్లా)లో అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. తమ భద్రతకు, జీవనోపాధికి, పర్యావరణ సమతౌల్యానికి ఈ కర్మాగారం ఆటంకంగా మారుతుందన్న భయంతో అక్కడి ప్రజలు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు.
వ్యక్తుల జీవన పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి విభిన్న వ్యక్తులకు అభివృద్ధి పట్ల విభిన్న భావనలుంటాయి.
జాతీయాదాయం (దేశ ఆదాయం) కంటే తలసరి ఆదాయాన్ని ఆర్థికాభివృద్ధికి సరైన సూచికగా తీసుకుంటారు. తలసరి ఆదాయాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని మానవాభివృద్ధిని కచ్చితంగా అంచనా వేయలేం.
{పపంచ బ్యాంక్ వివిధ దేశాల తలసరి ఆదాయాలను ప్రామాణికంగా తీసుకొని ప్రపంచ అభివృద్ధి నివేదిక-2012కు రూపకల్పన చేసింది. దీని ప్రకారం..
అధిక ఆదాయ (ధనిక) దేశాలు: 12,600 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలు.
మధ్యస్థ ఆదాయం ఉన్న (అభివృద్ధి చెందుతున్న) దేశాలు: 12,600 డాలర్ల కంటే తక్కువ 1035 డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలు.
తక్కువ ఆదాయం ఉన్న (పేద) దేశాలు: 1035 డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలు.
2013లో భారత్ తలసరి ఆదాయం 3285 డాలర్లు. పై జాబితా ప్రకారం ఇండియా మధ్య ఆదాయం ఉన్న దేశంగా గుర్తింపు పొందింది.
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (ూ్ఖఈ్క): ఏటా వివిధ దేశాలకు సంబంధించిన మానవాభివృద్ధి సూచికల నివేదికలను యూఎన్‌డీపీ విడుదల చేస్తుంది. వివిధ దేశాల ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను ప్రామాణికాలుగా తీసుకొని ఈ నివేదికలను రూపొందిస్తుంది. 2013లో వెలువరించిన ప్రపంచ మానవాభివృద్ధి సూచికలో మొత్తం 177 దేశాల్లో భారతదేశం 136వ స్థానాన్ని పొందింది.
విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన రాష్ట్రాలు అధిక వృద్ధి సాధిస్తున్నాయి. కేరళ, హిమాచల్ ప్రదేశ్ దీనికి మంచి ఉదాహరణలు. 2005లో భారతదేశం మొత్తం మీద విద్యకు సంబంధించి సగటున ప్రతి విద్యార్థిపై * 1049 ఖర్చుపెట్టగా హిమాచల్ ప్రదేశ్‌లో * 2005 ఖర్చుచేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ అక్షరాస్యత 73 శాతం ఉండగా, హిమాచల్ ప్రదేశ్‌లో అక్షరాస్యత 84 శాతంగా ఉంది. కేరళలో 94 శాతం అక్షరాస్యతతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.
కీలక పదాలు - నిర్వచనాలు
జాతీయాదాయం: ఒక దేశంలో ఒక ఏడాదిలో ఉత్పత్తి అయిన అంత్య వస్తువులు, సేవల విలువల మొత్తం. అంటే ఒక దేశంలోని వ్యక్తులు, సంస్థలు సంపాదించిన మొత్తం ఆదాయం.
తలసరి ఆదాయం: ఏడాదిలో ఒక దేశం మొత్తం జాతీయాదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చే మొత్తం.
తలసరి ఆదాయం జాతీయాదాయం ొ జనాభా
మానవాభివృద్ధి: తలసరి ఆదాయం, విద్యాస్థాయి, ఆరోగ్య స్థితుల ఆధారంగా లెక్కించే అభివృద్ధి. ఈ మానవాభివృద్ధి సూచికలను అభివృద్ధికి అత్యుత్తమ ప్రమాణాలుగా గుర్తించారు.
{పజా సదుపాయాలు: ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తుంది. ఈ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, సౌకర్యాలను ప్రజా సదుపాయాలు అంటారు.
విద్యా సూచికలు: మానవాభివృద్ధిని అంచ నా వేసేటప్పుడు విద్యా సూచికలను పరిగణనలోకి తీసుకుంటారు. అవి.. దేశంలో మొత్తం బడి వయసు పిల్లల సంఖ్య, వారిలో బడిలో ఉన్న పిల్లల సంఖ్య, బడికి వెళ్లకుండా బడి బయట ఉన్న పిల్లల సంఖ్య, అక్షరాస్యత శాతం మొదలైనవి.
ఆరోగ్య సూచికలు: శిశు మరణాల రేటు, ప్రసూతి రేటు, ప్రసూతి మరణాల రేటు, మానవ ఆయుఃప్రమాణం మొదలైనవి ఆరోగ్యసూచికలు. వీటిని మానవాభివృద్ధి సూచికలను నిర్ణయించడంలో ఉపయోగిస్తారు.
అక్షరాస్యత: దేశంలో ఒక ప్రత్యేకమైన భాషను చదివగలిగే, రాయగలిగే ప్రజలను అక్షరాస్యులు అంటారు. దేశంలో 7 ఏళ్ల వయసు, ఆ పైన ఉన్నవారిలో అక్షరాస్యుల సంఖ్యను అక్షరాస్యత రేటు అంటారు.
శిశు మరణ రేటు: సజీవంగా పుట్టిన ప్రతి వేయి మంది పిల్లల్లో ఏడాది లోపు వయసులోనే మరణించిన పిల్లల సంఖ్యను శిశు మరణాల రేటు అంటారు.
ఆయుఃప్రమాణం: వ్యక్తులు జీవించే సగటు వయసునే ఆయుఃప్రమాణం లేదా ఆయుర్దాయం అంటారు.
నాలుగు మార్కుల ప్రశ్నలు
1. ఆడవాళ్లు ఇంటి బయట పనిచేయడానికి, లింగ వివక్షతకు మధ్య సంబంధం ఏమిటి?
(సమకాలీన అంశాలపై ప్రతిస్పందన,
{పశ్నించడం)
{పాచీన కాలం నుంచి భారతీయ సమాజంలో స్త్రీ, పురుష వివక్షత (లింగ వివక్షత) కొనసాగుతూనే ఉంది. శారీరకంగా, విద్యాపరంగా, సామాజికపరంగా, ఆర్థికంగా స్త్రీ.. పురుషుడితో సమానం కాదని, స్త్రీ పురుషుడి అండతోనే ఉనికిలో ఉండాలనే అభిప్రాయం సమాజంలో ఇంకా ఉంది.
మహిళలు వంట గదికే పరిమితమవ్వాలని, వారికి తక్కువ కూలీ డబ్బులు ఇవ్వాలని, వారి సొంత వ్యక్తిత్వానికి ఎలాంటి గుర్తింపు ఇవ్వకుండా వారిని అనేక విధాలుగా అణగదొక్కాలనే చర్యలు మహిళల హక్కులను కాలరాస్తున్నాయి. వరకట్న వేధింపులు బాగా పెరిగి అనేక మంది స్త్రీలు బలవుతున్నారు.
ఈ విధమైన వివక్షతలను రూపుమాపాలంటే మహిళల అక్షరాస్యత పెరగాలి. తద్వారా వారు విజ్ఞానవంతులవ్వాలి. వంట గది నుంచి బయటకు వచ్చి వివిధ రకాల ఉద్యోగాలు చేయడానికి ముందుకు రావాలి. పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో ప్రవేశించాలి.
ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కూడా అనేక వివక్షతలను ఎదుర్కొంటున్నారు. వారు అలాంటి వాటిని ధైర్యంగా ప్రతిఘటించినప్పుడు అవి పునరావృతం కాకుండా కనుమరుగవుతాయి.
ఈ విధంగా మహిళలు కార్యోన్ముఖులై మహిళా సాధికారతను సాధించినప్పుడు సమాజంలోని లింగ వివక్షతను రూపుమాపవచ్చు. ఆడవాళ్లు విద్యావంతులై మగవాళ్లతో సమానంగా ఇంటి బయట కూడా పనిచేయడానికి సంసిద్ధులైనప్పుడు లింగ వివక్షత తగ్గుముఖం పడుతుంది.
2 మార్కుల ప్రశ్నలు
1. అభివృద్ధి అంటే ఏమిటి? వివిధ అభివృద్ధి భావనలను తెలపండి. (విషయావగాహన)
{పజలు స్వేచ్ఛగా, సమానత్వంతో జీవిస్తూ, జీవనానికి తగిన ఆదాయం, భద్రత పొందుతూ ఎలాంటి వివక్షతను ఎదుర్కోకుండా నాణ్యమైన జీవన ప్రమాణాన్ని కలిగి ఉండటాన్నే అభివృద్ధిగా పేర్కొంటారు.
అభివృద్ధి భావనలు:
జాతీయాదాయం, తలసరి ఆదాయం, అక్షరాస్యతలను పెంచడం. లింగ వివక్షత రూపు మాపడం, శిశు మరణాలను లేకుండా చేయడం. ఆయుఃప్రమాణం పెంచడం. ప్రజల అవసరాలు తీర్చే అన్ని సదుపాయాలు కల్పించడం.
2. భారత ప్రభుత్వం కుడంకుళంలో అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. దీని ప్రధాన ఉద్దేశం నిరంతరం పెరుగుతున్న దేశ విద్యుచ్ఛక్తి అవసరాలు తీర్చడం. అక్కడి ప్రజలు వారి భద్రత, రక్షణ, జీవనోపాధుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారు. ఈ పోరాటం మరింత కాలం కొనసాగే పరిస్థితి ఏర్పడింది. శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, సామాజిక ఉద్యమకారులు అక్కడి ప్రజల తరఫున ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. (ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి, అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం)
ఎ. ప్రభుత్వ ఉద్దేశాన్ని నీవెలా సమర్థిస్తావు?
{పజల విద్యుత్ అవసరాలు తీర్చడం ప్రభుత్వ బాధ్యత. విద్యుత్ ఉత్పత్తిని పెంచకపోతే భవిష్యత్‌లో పెరిగే దేశ జనాభా విద్యుత్ అవసరాలు తీర్చడం వీలు కాదు. దేశ అభివృద్ధి దృష్ట్యా విద్యుదుత్పాదనకు అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించడం ఆవశ్యకం.
బి. ప్రజల వ్యతిరేకతను అంగీకరించాలంటే ప్రభుత్వానికి నీవేం ప్రత్యామ్నాయ పరిష్కారం చూపుతావు?
{పభుత్వం పూర్తిగా అణు విద్యుత్‌పైనే కాకుండా ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన పునరుద్ధారిత ఇంధన వనరులపై దృష్టి పెట్టాలి. అలాంటి వాటిలో సౌర విద్యుత్, పవన విద్యుత్, సముద్ర అలల విద్యుత్ ముఖ్యమైనవి. వీటికి ఖర్చు ఎక్కువైనా.. ప్రమాద రహితమైనవి.
1 మార్కు ప్రశ్నలు
1. భూమి లేని గ్రామీణ కార్మికుల అభివృద్ధి లక్ష్యాలేవి? (విషయావగాహన)
జీవించడానికి కావాల్సిన కనీస వేతనం, సామాజిక వివక్ష లేకపోవడం.
2. కింది చిత్రం ఏ రకమైన దేశాన్ని సూచిస్తుంది? (పట నైపుణ్యం)
ధనికులు, పేదలు అనే రెండు వర్గాలున్న దేశం.
అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?
Published Wed, Jan 14 2015 11:27 PM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM
Advertisement