
వడ్డీ కట్టలేదని మహిళపై కరెంట్ వైర్లతో దాడి
హైదరాబాద్: హైదరాబాద్ శివారు ప్రాంతమైన కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజూకు శృతిమించుతున్నాయి. మంగళవారం తాజాగా తీసుకున్న నగదుపై వడ్డీ చెల్లించలేదంటూ వడ్డీ వ్యాపారులు ఓ మహిళపై వైర్ల, రోకలి బండతో దాడి చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధిత మహిళ కూషాయిగూడ పోలీసులకు ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి... ఆమెను ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వడ్డీ వ్యాపారులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.