మహిళపై ఇద్దరు ఆటో డ్రైవర్ల అత్యాచారం | Woman raped by two auto drivers | Sakshi
Sakshi News home page

మహిళపై ఇద్దరు ఆటో డ్రైవర్ల అత్యాచారం

Published Wed, Feb 25 2015 6:48 PM | Last Updated on Sat, Aug 25 2018 6:22 PM

Woman raped by two auto drivers

హైదరాబాద్ క్రైం: అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా నడిరోడ్డుపై నడవగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని మహాత్ముడు ఏనాడో అన్నాడు. కాని ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా మారాయి. గమ్యస్థానానికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన మహిళను ఇద్దరు ఆటోడ్రెవర్లు నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ సంఘటన నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

హైదరాబాద్ నగరంలోని కత్బుల్లాపూర్ పరిధిలో బ్యూటి పార్లల్ నిర్వహిస్తున్న 30 ఏళ్ల మహిళ మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చింతల్ వెళ్లడానికి ఆటో ఎక్కింది. ఆటోను హెచ్‌ఎంటీ పరిధిలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి తన స్నేహితునితో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆ మహిళ జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement