'ఐలయ్యకు రక్షణ కల్పించాలి' | writers demands protection for kancha ilaiah | Sakshi

'ఐలయ్యకు రక్షణ కల్పించాలి'

May 23 2016 10:17 PM | Updated on Sep 4 2017 12:46 AM

గడిచిన మూడేళ్లుగా దేశంలో అసమ్మతిని తప్పుడు పద్దతుల్లో బలవంతంగా అణచివేసే కార్యక్రమం పాలకవర్గ భావజాల మద్దతుతో అధికారికంగా జరుగుతోందని పలువురు రచయితలు ఆందోళన వ్యక్తం చేవారు.

సాక్షి, హైదరాబాద్: గడిచిన మూడేళ్లుగా దేశంలో అసమ్మతిని తప్పుడు పద్దతుల్లో బలవంతంగా అణచివేసే కార్యక్రమం పాలకవర్గ భావజాల మద్దతుతో అధికారికంగా జరుగుతోందని పలువురు రచయితలు ఆందోళన వ్యక్తం చేవారు. ఈ మధ్య ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై బ్రాహ్మణ సంఘాలు బెదిరింపులకు దిగడం ఈ కోవలోకే వస్తాయని, సమాజానికి మేథో దీపదారులుగా ఉండే ఉపాధ్యాయులు, రచయితలు, బుద్ధిజీవులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడుల్లో భాగంగానే ఐలయ్యపై దాడిగా భావిస్తున్నామని రచయితలు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రముఖ విప్లవకవి వరవరరావు, జీఎస్.రామ్మోహన్, పి.వరలక్ష్మి, ఎన్.వేణుగోపాల్, డాక్టర్ సూరేపల్లి సుజాత, స్కైబాబా, ఎండ్లూరి సుధాకర్ సహా 88 మంది రచయితలు ఒక ప్రకటన విడుదల చేశారు.

మేధావి వర్గంపై భౌతిక దాడులు జరగడం, మానసిక ఆందోళనకు గురిచేయడం, ప్రాణ భయానికి లోను చేయడం, ప్రత్యామ్నాయ ప్రభుత్వంల్లా వ్యవహరించడం ఇటీవల బాగా పెరిగిపోయిందన్నారు. ఈ క్రమంలోనే ఐలయ్యపై కేసులు పెట్టడం, భౌతికంగా బెదిరించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని, ఇది సరైన ప్రజాస్వామిక ధోరణి కాదని భావిస్తూ రచయితలుగా ఖండిస్తున్నామన్నారు. నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారే, ఎంఎం కాల్బుర్గి వంటి రచయితల మీద జరిగిన దాడులకు కొనసాగింపుగానే ప్రొఫెసర్ ఐలయ్యపై దాడులు జరుగుతున్నట్లు భావిస్తున్నామన్నారు. ఐలయ్యకు తక్షణం రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామిక వాదలుఉ, ప్రగతి వాదులు ఐలయ్యకు మద్దతుగా నిల వాలని రచయిత లంతా తమ ప్రకటనలో కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement