యువ హీరో ఉదయ్‌కిరణ్ కు రిమాండ్
జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటలో ఓవర్ ద మూన్ పబ్‌లోకి అనుమతించడం లేదని ఆగ్రహంతో అద్దాలు ధ్వంసం చేసి పబ్‌లోకి వెళ్లి .. నగ్నంగా నృత్యాలు చేసిన కేసులో అరెస్టైన యువనటుడు నేమూరి ఉదయ్‌కిరణ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 23వ తేదీన రాత్రి ఓవర్ ద మూన్ పబ్‌కి వచ్చిన ఉదయ్‌కిరణ్‌ను గతంలో జరిగిన గొడవలు దృష్టిలో పెట్టుకొని బౌన్సర్లు అనుమతించలేదు. దీంతో అద్దాలు పగలగొట్టి కుర్చీలు ఎత్తివేసి భీభత్సం సృష్టించాడు. అంతటితో ఆగకుండా పబ్ లో బట్టలు విప్పేసి నగ్నంగా డ్యాన్స్ చేసి కలకలం సృష్టించాడు. ఈ ఘటనలో ఉదయ్‌కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించారు.
విచారణలో ఉదయ్ కిరణ్ గత చరిత్రంతా నేరాలమయమేనని తేలింది. ఇటీవలనే జూబ్లీహిల్స్‌లోని ఎయిర్‌పబ్ దగ్గర పిస్టల్‌తో సన్నిహితుడిపై దాడికి దిగాడు. మాదాపూర్‌లో నిర్భయచట్టం కింద అరెస్టు అయ్యాడు. కాకినాడ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానని ఓ మహిళను నమ్మించి ఆమె కూతురితో స్నేహం చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో అరెస్టు అయ్యాడు. కాకినాడలోని జీఆర్పీ బార్‌లో కూడా గొడవ చేసిన ఘటనలో జైలుకు వెళ్లాడు. సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనలోను క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని తేలింది.
అంతేకాదు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి స్నేహితులు, బంధువుల ఖరీదైన కార్లను అరువు తీసుకునే వాడని.. తిరిగి ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టేవాడని తెలిసింది. కాగా..ఉదయ్ కిరణ్ తల్లి నగరంలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్‌గా పని చేస్తున్నారు. ఫ్రెండ్స్‌బుక్, పరారే సినిమాల్లో హీరోగా నటించిన ఉదయ్‌కిరణ్ డ్రగ్స్ కేసులోనూ గతంలో పట్టుబడి జైలు జీవితం అనుభవించాడు. మోసాలకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తూ జల్సాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసు కస్టడీకి తీసుకోనున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు.